For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రజనీకాంత్ దెబ్బకి బుక్ మై షో (Book my show ) సైట్ ఉక్కిరిబిక్కిరి మీరే చూడండి.

By girish
|

ఇండియన్ సూపర్ స్టార్ రజనికాంత్ మరియు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన రోబో 2 .0 సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడు నుంచి భారీ అంచనాలు ఏర్పడాయి. దీనికి కారణం రజనికాంత్ మరియు డైరెక్టర్ శంకర్ కంబో అలాగే ముందుగా విడుదలైన చిట్టి రోబో అదే అండి రోబో.

బాహుబలి'తో

బాహుబలి'తో

బాహుబలి'తో పోల్చి ‘2.0'కి అంత క్రేజ్ లేదని అంటున్నారు కానీ.. దీనికి హైప్ అంత తక్కువేమీ లేదని స్పష్టమవుతోంది. విడుదలకు ముందే ‘బుక్ మై షో'లో ఈ చిత్రం రికార్డు నెలకొల్పింది. ఈ వెబ్ సైట్ ద్వారా అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడైన సినిమాగా ‘2.0' రికార్డులకెక్కింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ‘2.0' ఈ మైలురాయిని టచ్ చేసింది. బుధవారం నాటికే ‘బుక్ మై షో'లో ‘2.0'కు మిలియన్ టికెట్లకు పైగా అమ్ముడయ్యాయి.

10 లక్షల

10 లక్షల

‘బాహుబలి: ది కంక్లూజన్'కు సైతం ఇంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడవలేదని అంటున్నారు. ఇది ఎంత వరకు క్రెడిబుల్ న్యూస్ అన్నది తెలియడం లేదు కానీ.. ‘బాహుబలి'తో పోల్చకుండా మామూలుగా చూస్తే మాత్రం కేవలం ‘బుక్ మై షో'లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మాత్రమే 10 లక్షలకు పైగా టికెట్లు తెగడమంటే మామూలు విషయం కాదు. తెలుగులో చివరగా వచ్చిన పెద్ద సినిమా ‘అరవింద సమేత' రిలీజైన ఐదారు రోజులకు ‘బుక్ మై షో'లో 10 లక్షల టికెట్ల మైలురాయిని అందుకుంది.

దాంతో పోలిస్తే

దాంతో పోలిస్తే

ఐతే దాంతో పోలిస్తే ‘2.0' భారీగా రిలీజవుతోంది. మూడు భాషల్లో దేశవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. పేటీఎం - జస్ట్ టికెట్స్.. ఇలా సినిమాల టికెట్లు అమ్మే మరికొన్ని వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. ఇక ఆన్ లైన్ బుకింగ్సే లేని థియేటర్లుంటాయి

ఆన్ లైన్లో

ఆన్ లైన్లో

ఆన్ లైన్లో ఉన్న థియేటర్లకు కూడా లైవ్ బుకింగ్ ఉంటుంది. ఆ లెక్కలన్నీ కలిపితే ఇప్పటిదాకా ఎన్ని టికెట్లు అమ్ముడై ఉంటాయో అంచనా వేయలేం. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మాత్రమే ఈ చిత్రం పదుల కోట్లలో వసూళ్లు రాబట్టి ఉంటుందన్నది మాత్రం స్పష్టం.

Read more about: business
English summary

రజనీకాంత్ దెబ్బకి బుక్ మై షో (Book my show ) సైట్ ఉక్కిరిబిక్కిరి మీరే చూడండి. | Record Ticket Sales in Book My Show

Bahubali '2.0 is saying that there is no craze but it's clear that the hype is no small. The film was set in 'Book My Show' before the release. The '2.0' records for the fastest 10 lakh tickets sold through this website. '2.0' has touched this milestone with only advance bookings. By Wednesday, 'Book My Show' sold over a million tickets for '2.0'.
Story first published: Thursday, November 29, 2018, 12:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X