పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గుతూవస్తున్నాయి ఈరోజు ధరలు చూడండి.
గత కొద్ది రోజులుగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ ధరలు తగ్గడం ద్వారా వాహనదారులు కొద్దిగా ధరల నుంచి ఉపశమనం పొందారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గడంతో కొన్ని మొబైల్ యాప్ లు మరి కొన్ని గ్యాస్ సిలిండర్ కంపెనీలు పెట్రోల్ ఉచితంగా ఇచ్చాయి. ఇక ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో.. దేశీయంగా కూడా పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం (నవంబరు 29) మరోసారి తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 33 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధరరూ.73.24 కి చేరింది. డీజిల్ ధర 36 పైసలు తగ్గి రూ.68.13 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో 32 పైసలు తగ్గిన పెట్రోలు ధరరూ.78.80 కి చేరగా.. డీజిల్ ధర 38 పైసలు తగ్గి రూ.71.33కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరింత దిగజారి బ్యారెల్ 59.18 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 50.54 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 35 పైసలు తగ్గి రూ. 77.65 ఉండగా.. డీజిల్ ధర 39 పైసలు తగ్గి రూ.74.13గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.77.04 ఉండగా.. డీజిల్ ధర రూ.73.11 వద్ద కొనసాగుతోంది.
నవంబరు 29న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ ₹ 73.24 ₹ 68.13
ముంబయి ₹ 78.80 ₹ 71.33
కోల్‌కతా ₹ 75.24 ₹ 69.98
చెన్నై ₹ 76.01 ₹ 71.95
బెంగళూరు ₹ 73.81 ₹ 68.48
హైదరాబాద్ ₹ 77.65 ₹ 74.13
విజయవాడ ₹ 77.04 ₹ 73.11


Click it and Unblock the Notifications