యూట్యూబ్ లవర్స్ కి గుడ్ న్యూస్ ఏంటో చూడండి.
ఈరోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక స్మార్ట్ ఫోన్ ఉంటే దాంట్లో రకరకాల యాప్ లు ఉంటాయి. ఈ యాప్స్ లో ప్రధానంగా ఉండే యాప్ యూట్యూబ్. ఈ యూట్యూబ్ ద్వారా ఎన్నో వీడియోస్ చూడచ్చు అలాగే ఎన్నో వైరల్ వీడియోస్ కూడా చూడచ్చు. ఇక ఈ యూట్యూబ్ ద్వారా ఈరోజుల్లో ఎంతో మంది కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి యూట్యూబ్ వాడుతున్న వారికీ ఒక శుభవార్త ఏంటో తెలుసా!

యూట్యూబ్
ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ సైట్ యూట్యూబ్ అతిపెద్ద ప్రకటన చేసింది. త్వరలోనే తన యూజర్లకు ఉచితంగా కొత్త సినిమాలు, షోలు చూసే వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అదీ ఎలాంటి వ్యాపార ప్రకటనల అంతరాయం లేకుండా. ప్రపంచ ప్రసిద్ధ సెర్చింజన్ గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ లో కొన్ని సినిమాలు, షోలు చూసేందుకు డబ్బు కట్టాలి. కానీ ఇకపై అలాంటి అవసరం ఉండదు

ఫ్రీగా
యూట్యూబ్ లో ఫ్రీగా సినిమాలు చూసే ఫీచర్ కొత్త ఏడాది ప్రారంభంలో లాంచ్ అవుతుంది. ఇందులో యూట్యూబ్ ఎక్స్ క్లూజివ్ వీడియోలు, షోలు చూసేందుకు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రీమియమ్, ఎక్స్ క్లూజివ్ కంటెంట్ చూసేందుకు రుసుము చెల్లించాల్సి ఉంది. యూట్యూబ్ పెయిడ్ సర్వీస్ మాత్రమే యాడ్ ఫ్రీగా వస్తోంది. అందువల్ల యూట్యూబ్ కొంత మొత్తం వసూలు చేస్తోంది.

యూట్యూబ్ ప్రీమియమ్ సబ్ స్క్రిప్షన్
యూట్యూబ్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ తరహాలో ఇకపై తన సొంత షోలు, సినిమాలు నిర్మించి విడుదల చేయనుంది. యూట్యూబ్ మూడేళ్ల క్రితం పెయిడ్ సర్వీసులు ప్రారంభించింది. ప్రస్తుతం 29 దేశాల్లో ఇదే తరహాలో నిర్వహిస్తోంది. అయితే ఇప్పటి వరకు యూట్యూబ్ తన పెయిడ్ సబ్ స్క్రైబర్ల సంఖ్యను ప్రకటించలేదు. అమెరికాలో ఒక నెలకు యూట్యూబ్ ప్రీమియమ్ సబ్ స్క్రిప్షన్ నెలకు 12 డాలర్లు (రూ.850)గా ఉంది.

యూట్యూబ్ యూజర్ల సంఖ్య:
యూట్యూబ్ నిజంగానే తన సొంత సినిమాలు, షోలు నిర్మించి విడుదల చేయడం ప్రారంభిస్తే భారత్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి వీడియో స్ట్రీమింగ్ సైట్లు, యాప్ లకు కష్టాలు తప్పవు. ఎందుకంటే యూట్యూబ్ యూజర్ల సంఖ్య భారత్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర సైట్లు, యాప్ ల కంటే ఎన్నో రెట్లు అధికం. కొన్ని రోజుల క్రితమే యూట్యూబ్ వీడియోల మధ్య నుంచి వ్యాపార ప్రకటనలు తొలగించే ప్రయత్నంలో ఉన్నట్టు ప్రకటించింది మూలం :ఎన్ టీవీ.


Click it and Unblock the Notifications