For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటి అద్దెలు కడతాం అలాగే ల్యాప్ ట్యాప్‌లిస్తాం..మోడీ ప్రకటన!

By girish
|

దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ ఎన్నికల మీద కన్ను ఉంది. అందుకే మొత్తం దేశంలోన్ ఉన్న కీలక రాజకీయ నాయకులు మొత్తం అంతా తెలంగాణలో ఉన్నారు. అటు టిఅర్ఎస్ మరో వైపు కాంగ్రెస్ కూటమి ఇంకో వైపు బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు ప్రజల పై వరాల జల్లు కురిపిస్తున్నాయి. మొన్న టిఅర్ఎస్ నిన్న కాంగ్రెస్ కూటమి ఈరోజు బీజేపీ ఇలా ఎవరి మేనిఫెస్టో వారు వదిలారు. బీజేపీ మేనిఫెస్టో చూద్దాం.

మీ ఇంటి అద్దెలు కడతాం అలాగే ల్యాప్ ట్యాప్‌లిస్తాం..మోడీ ప్రకటన!

ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల అద్దెల కోసం నెలకు రూ. ఐదు వేల రూపాయలు ఇస్తామని భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇదే ప్రధాన హామీగా మేనిఫెస్టోను . ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విడుదల చేశారు. విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు, తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన వారికి రూ. ఐదు వేలు పెన్షన్, అమర వీరుల కుటుంబాలకు రూ. లక్షల సాయం కూడా.. మేనిఫెస్టోలో ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్... ఓ మీడియా సమావేశంలో పేదల ఇళ్ల అద్దెల్ని కడతామని.. ఆ ఎన్నికల హామీని మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. ఈ ఆలోచన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత ఓ హుస్నాబాద్ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న కేసీఆర్ ఈ హామీపై సెటైర్లు వేశారు. కేంద్రం గత ఎన్నికల సమయంలో మనిషికి రూ. 15 లక్షలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెప్పారని.. ముందు ఆ హామీని నెరవేర్చాలన్నారు. అంతటితో ఆగలేదు... " బీజేపీ నేతలు చెంబట్క పోతే వాసన రాకుండా చేస్తామని" కూడా హామీ ఇస్తారని కూడా ... కామెడీ చేశారు. అయినా బీజేపీ నేతలు ఆ హామీకే కట్టుబడి ఉన్నారు.

కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదేమిటని... బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఓ సందర్భంలో... మీడియా అడిగితే.. ఎన్నికల సందర్భంలో వంద చెబుతాం... అన్నీ చేయలగమా ఏమిటి.. అంతా జుమ్లా అని... తేలిగ్గా తీసి పడేశారు. అప్పట్నుంచి బీజేపీ హామీలకు విలువ లేకుండా పోయింది. విచిత్రంగా.. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహా హామీని... కొద్దిగా మార్చి తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. డబుల్ బెడ్ రూం ఇళ్లకు అర్హత సాధించిన నిరుపేదలకు.. వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకూ.. ఏడాదికి రూ. 50 వేల వరకూ అద్దె కడతామని హామీ ఇచ్చింది. దీన్నే తెలంగాణ బీజేపీ లక్ష్మణ్ గుర్తు చేసి.. తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని మండిపడ్డారు

Read more about: modi
English summary

మీ ఇంటి అద్దెలు కడతాం అలాగే ల్యాప్ ట్యాప్‌లిస్తాం..మోడీ ప్రకటన! | BJP Manifesto in Telangana

The whole country is now eyeing the Telangana election. That is why all the key political leaders in the entire country are in Telangana. On the other side of the TRS, the Congress alliance is on the other side of the BJP and all the political parties are pouring in on the people. The Congress Tribunes yesterday called on the ruling party and the manifesto who left the manifesto. Let's look at the BJP manifesto.
Story first published: Thursday, November 29, 2018, 17:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X