For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి పెట్రోల్ ధరలు ఇంత తక్కువకు దిగిరావడం.

గత నెల రోజుల నుండి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.నేడు పెట్రోలు పై 50 పైసలు, డీజిల్ పై 40 పైసలు తగ్గించింది.

By bharath
|

గత నెల రోజుల నుండి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.నేడు పెట్రోలు పై 50 పైసలు, డీజిల్ పై 40 పైసలు తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోలు అతి తక్కువ ధరలు ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోలు లీటర్ రూ.73.57, ముంబైలో రూ.79.12, బెంగుళూరులో రూ.74.15, చెన్నైలో రూ.76.35, కోలకతాలో రూ.75.57 రూపాయల ధరలు ఉన్నాయి.

ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి పెట్రోల్ ధరలు ఇంత తక్కువకు దిగిరావడం.

అదేవిదంగా ఢిల్లీలో లీటరు డీజిల్ రూ.68.49, ముంబైలో రూ.71.71, బెంగుళూరులో రూ 68.85, చెన్నైలో రూ. 72.34 మరియు కోలకతాలో రూ .70.34 ధరలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడమే కాకుండా ఎక్సైజ్ సుంకం తగ్గిపోవడం మరియు అనేక రాష్ట్రాల్లో అమ్మకపు పన్ను (వ్యాట్) తగ్గించడం కూడా దీనికి ప్రధాన కారణం.

పెట్రోల్, డీజిల్ ధరలు ఆగస్టు మధ్యకాలం నుంచి అక్టోబర్ 4 వరకు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం దరల తగ్గింపు విషయంలో ప్రత్యేక ద్రుష్టి సారించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. గత నెల, ముడి చమురు ధరలు అంచనా ఒక బ్యారెల్ కు $ 100 డాలర్లు ఉండగా మరియు ఇప్పుడు ఇది సగానికి $ 50 కి తగ్గించబడింది. US WTI క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 52 డాలర్లకు దిగువగా ఉండగా, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 60 డాలర్లుగా ఉన్నాయి.

అక్టోబరు ప్రారంభంలో పెట్రోలు, డీజిల్ ధరలన్నీ తారాస్థాయికి పెరగడంతో ముడి చమురు ధరలు దాదాపు మూడింట ఒక వంతు విలువ కోల్పోయాయి. దీంతో ఆర్ధిక మార్కెట్లలో విస్తృత బలహీనతతో భారీగా ధరలు పడిపోయాయి.

డాలర్ తో రూపాయి మారకం విలువ 74 దాటిపోయింది.భారత్కు చమురు దిగుమతులపై మరింత బలహీనపరుస్తోంది.అంతర్జాతీయ చమురు మార్కెట్లో, అందరి కళ్ళు డిసెంబరు 6 న జరగనున్న OPEC సమావేశం పై పెట్టాయి, ఇక్కడ నిర్మాతలు సరఫరా తగ్గించాలని మరియు ధరలు పెంచుతుందని భావిస్తున్నారు.

Read more about: petrol diesel
English summary

ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి పెట్రోల్ ధరలు ఇంత తక్కువకు దిగిరావడం. | Petrol Has Never Been This Cheap During The Financial Year.

New Delhi: Following successive cuts for over a month, petrol and diesel prices are now at their lowest during the last few months. The price of petrol was cut by 50 paise and diesel by 40 paise today.
Story first published: Wednesday, November 28, 2018, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X