మీకు రేషన్ కార్డు ఉందా? కేంద్రం ఇస్తున్న ఆఫర్ ఇదే
ఇక మొత్తం దేశమంతటా ఎన్నికల సమరం దగ్గరలో ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల యుద్ధం అప్పుడే మొదలయ్యింది. ఇక ఒక 15 రోజుల్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కూడా రాబోతోంది. ఇలాంటి సమయంలో కేంద్రం ప్రజలను అక్కటుకోవడానికి కొన్ని పధకాలు తీసుకురానుంది.

రేషన్ కార్డులకి
ఇక పేద ప్రజలను ఎక్కువ ఆకర్షించేందుకు కేంద్రం రేషన్ కార్డులకి ఒక పధకం తీసుకోని రానుంది అని సమాచారం. అలాగే ఇళ్ల పేరిట సబ్సిడీ ఇవ్వడం పరిశీలనలో ఉన్నాయి అని సమాచారం. అందుకే ప్రభుత్వం కొత్త పధకాన్ని అమలులోకి తీసుకోని రానుంది అని సమాచారం.

రేషన్ షాప్ దగ్గర
ఇక ప్రజలు రేషన్ షాప్ దగ్గర పడి కాపులు కాయడం రేషన్ లేదు అంటే వెనుతిరిగి వెళ్లడం ఇక అలాంటి సంఘటనలు జరగవు అని ప్రభుత్వం పెద్దలు అంటున్నారు. ఇక ప్రభుత్వం అమలులోకి తీసుకోని రావాలి అనుకుంటున్న పధకం ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా రేషన్ కార్డు ఉన్న వ్యక్తుల బ్యాంకు అకౌంట్ లో నెలకి రూ.700 రూపాయలు వేయనుంది అని సమాచారం.

మొత్తం రూ.700
ఆరుగురు ఉన్న ఇంటికి ఒక్కొకరుకి నాలుగు కేజీల చెప్పున బియ్యం ఇస్తుంది అంటే మొత్తం 24 కేజీలు ఒక్కొక కేజీకి రూ.25 చెప్పున చెల్లించే ఏర్పాటు చేసింది అంటే రూ.640 రూపాయిల మిగతా వాటితో కలిపి మొత్తం రూ.700 కేంద్రం వారి అకౌంట్ లో బదిలీ చేస్తుంది అని సమాచారం. ఆలా అకౌంట్ లో బదిలీ ఐన రూ.700 రూపాయలతో ఎవరికీ ఇష్టం ఉన్నది వారు కొనవచ్చు.

నిత్యావసర వస్తువుల
ఇక ఈ పధకం ఇప్పటికే పుదుచేరి, చండీగఢ్ మరియు దాద్రా నగర్ హవెలిలో అమలులో ఉంది ఈ పధకం అక్కడ విజయవంతం కావడంతో మిగతా రాష్ట్రాలలో కూడా కేంద్రం అమలు చేయాలనుకుంటోంది అని సమాచారం. అయితే దీనిపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సబ్సిడీ తో ధరలకే పేదలకు నిత్యావసర వస్తువులను అందియాల్సిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ షాపులకి గండి కొట్టాలి అని చూస్తోంది అని వాపోతున్నారు.

కేవలం బియ్యం
ఇక కేవలం రూ.700 రూపాయలకు ఒక కుటుంబ అవసరాలకు ఇలా సరిపోతుంది అని కేవలం బియ్యం కొనుకుంటే సరిపోతుందా మిగతా పప్పులు , ఉప్పులూ ఎక్కడి నుండి వస్తాయి అని ప్రశ్నిస్తున్నారు.

మోడీ ప్రభుత్వం
ఇక ఇప్పటికే రేషన్ షాపులో ఇవ్వాల్సిన వస్తువులు అంతంత మాత్రంగా ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పథకాలతో పేదల కడుపు కొట్టడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు అని విమర్శలు చేస్తున్నారు చూడాలి మరి మోడీ ప్రభుత్వం ఏమి చేస్తుందో ఈ పధకం మొదలు పెట్టి పేదలలో మంచి పేరు వస్తుందో లేదా విమర్శలు ఎదురుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications