భూములకు భరోసా ప్రతి భూమికి ఇక నుంచి భూధార్ కార్డు ఏంటో మీరే చూడండి.

ఈరోజుల్లో మనందరికీ ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు లేని వారు అంటూ ఉంటారు. ఇక ఇది ఎందుకు చెబుతున్నాము అంటే మన మనుషులకి అయితే ఆధార్ కార్డు ఉండాలి అదే మరి మనిషి నివశించే భూమికి ఏమి ఉండాలి. ఎక్కువ ఆలోచించకండి భూమికి భూధార్ కార్డు ఉంది.

భూధార్ కార్డు

భూధార్ కార్డు

భూధార్ కార్డు ఏంటి అని అనుకుంటున్నారా? తాజాగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్డు ఆంధ్రప్రదేశ్ లో అమలు పరిచాడు. ఇక ఈ భూధార్ వల్ల కలిగే లాభాలు ఏంటి అసలు ఈ భూధార్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాంకు అకౌంట్లు

బ్యాంకు అకౌంట్లు

మాములుగా ఆధార్ కార్డు అంటే మొత్తం మన వివరాలు అన్ని ఉంటాయి అంటే మన బ్యాంకు అకౌంట్లు, ఆస్తుల వివరాలు ఆఖరికి మనం వాడే సిమ్ కార్డు కూడా ఆధార్ నెంబర్ ఉంటే తెలుసుకోవచ్చు. ఇక భూధార్ అంటే మీకు భూములు ఏమన్నా ఉంటే వాటి వివరాలు మొత్తం వస్తాయి ఈ భూధార్ కార్డుకి పదకొండు నంబర్లు వస్తాయి.

భూధార్ నెంబర్

భూధార్ నెంబర్

ఇక ప్రతి భూమికి కూడా భూధార్ నెంబర్ త్వరలో వస్తుంది. ఆ నెంబర్ కింద భూమి యజమాని పేరు, భూమి విస్తీర్ణం మరియు భూమి యొక్క విలువ మొత్తం దాదాపు 20 అంశాలని ఆ నెంబర్ కింద పొందుపరుస్తారు. ఇక భూమికి సంబంధించిన సెర్వే నెంబర్లు ఉంటాయి వాటికీ కూడా ఒక జీవో ట్యాగ్ పెడతారు.

గూగుల్ మ్యాప్

గూగుల్ మ్యాప్

ఇక మీరు మీ భూధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మొత్తం మీ భూమి యొక్క వివరాలు పై చెప్పిన అని వివరాలు అదేకాక భూమి పైన ఉండే అప్పులు కూడా అన్ని చూపిస్తాయి. ఇక ఈ భూధార్ ఆప్ కూడా వస్తుంది దింట్లో ట్యాగ్ వల్ల మొత్తం మీకు భూమి అంతా గూగుల్ మ్యాప్ లాగా కనిపిస్తుంది.

రిజిస్ట్రేషన్

రిజిస్ట్రేషన్

ఇక ఒక భూమి కొనాలి లేదా ఒక భూమి అమ్మాలి అంటే చాలా కష్టం దానికి చాలా పెద్ద పని ఉంటుంది అంటే భూమి పట్టా ఇక రిజిస్ట్రేషన్ ఇలా ఉన్నాయి కానీ వీటికి ఇంకా ప్రజలు ఇబ్బంది పడకుండా ఆటో మ్యుటేషన్ అని ఒక సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఇక ఈ ఆటో మ్యుటేషన్ ద్వారా మీరు ఏమన్నా పొలం అమ్మాలి అనుకున్న మనకు ఇప్పుడు పట్టే సమయం కన్నా చాలా తక్కువ సమయం పడుతుంది.

కృష్ణ జిల్లా జగ్గయ్య పేట

కృష్ణ జిల్లా జగ్గయ్య పేట

ఇక ఈ భూధార్ కార్డు 2019 ఫిబ్రవరి 15 తేదీన కృష్ణ జిల్లా జగ్గయ్య పేట లో మొదట జరుగుతుంది. ఇక మొత్తం అక్టోబర్ 2019 లో ఆంధ్రప్రదేశ్ అంతటా అమలులోకి వస్తుంది. ఇక మొత్తం 4 .19 కోట్ల స్థిరాస్థులకి ఈ భూధార్ కార్డు కేటాయించాలి అని నిర్ణయం తీసుకున్నారు.

ప్రధాన ఉద్దేశం

ప్రధాన ఉద్దేశం

ఈజీగా చెప్పాలి అంటే ఈ పద్దతిని డిజిటలిజషన్ అని అంటారు. ఇక ఈ కార్డు ప్రధాన ఉద్దేశం తప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటాయి అంటే ఒక భూమి మీద ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకొంటారు లేదా ఒకే భూమి చూపించి ఇద్దరు బ్యాంకులలో లోన్ తీసుకోవడం ఇలాంటి అన్నిటికి అడ్డుకట్ట వేయడానికి ఈ భూధార్ కార్డు అనేది తీసుకొస్తున్నారు.

 నంబర్లు

నంబర్లు

ఇక మనకు రెండు రకాల భూములు తెలుసు ఒకటి ప్రభుత్వ భూములు రెండోది ప్రైవేట్ భూములు ఇక ప్రభుత్వ భూములకు భూధార్ నంబర్లలో మొదటి రెండు నంబర్లు 00 అని ఉంటాయి ప్రైవేట్ భూములు అంటే ఇల్లు, ఆఫీస్, ఇక రకరకాల భూములకు ప్రస్తుతానికి 99 అని ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+