జన్ ధన్ అకౌంట్ పుణ్యమా అని దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకు లో అకౌంట్ వచ్చేసింది. ఇక ప్రజల దగ్గర ఉన్న డబ్బు అంతా బ్యాంకులలో వచ్చేసింది. ఆ తర్వాత బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ కూడా జరిగిపోయింది. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది బ్యాంకు అకౌంట్ తో మన ఆధార్ కార్డు నెంబర్ తప్పుగా ఎంటర్ అయితే ఏమైతుంది అని తెలుసుకుందామా.

కర్నూల్ జిల్లా
ఇక బ్యాంకు అకౌంట్ తో ఆధార్ కార్డు తప్పుగా ఎంటర్ చేస్తే ఏమవుతుందో రాయలసీమలో ఒక జిల్లా కర్నూల్ జిల్లా లో ఈ సంఘటన చూసి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక కర్నూల్ జిల్లా బనగాన పల్లి పట్టణం పంచమ పేటకు చెందిన పుష్ప లతా అనే ఆమెకి స్థానిక స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో అకౌంట్ ఉంది అందులోనే తాను డబ్బు డిపాజిట్ చేస్తూ వస్తోంది.

విత్ డ్రా
ఇక గత నెల అక్టోబర్ లో తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 61,110 విత్ డ్రా జరిగింది. తనకు తెలియకుండా ఎలా జరిగింది అని బ్యాంకు అధికారులను సంప్రదించింది నేను డ్రా చేయలేదు అని ఆమె స్పష్టం చేసింది. ఇక ఆమె అకౌంట్ పరిశీలించిన అధికారులు అసలు తప్పు గుర్తించారు.

సైబర్ నేరగాళ్లు
బ్యాంకు అకౌంట్ తో తన ఆధార్ నెంబర్ కాకుండా వేరే వారిది ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారు. దీని గుర్తించిన సైబర్ నేరగాళ్లు నకిలీ వేలిముద్రతో డబ్బులు మొత్తం డ్రా చేయిన్నట్లు అధికారులు గుర్తించి వెంటనే సరిచేశారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక తన అకౌంట్ నుంచి పోయిన రూ.61,110 మాత్రం తిరిగి ఇవ్వడంలో బ్యాంకు అధికారులు చేతులు ఏతేశారు.

బ్యాంకు అధికారులు
బ్యాంకు అధికారుల నుంచి ఇలాంటి స్పందన రాకపోవడం పోయిన తన డబ్బు తన అకౌంట్ లో పడకపోవడంతో పుష్ప లతా గారు పోలీసులని ఆశ్రయించింది. ఇక బ్యాంకు అధికారులు కూడా కంప్లైంట్ చేసారు. సైబర్ నేరగాళ్లు డబ్బు ఎక్కడ నుంచి మాయం చేశారు అనేది మాత్రం ఇంకా తేలలేదు.

అభిమన్యుడు
ఇక ఇటీవల వచ్చిన తమిళ్ మరియు తెలుగులో విడుదలైన విశాల్ సినిమా అభిమన్యుడు సినిమాలో లాగా జరిగింది అని నిపుణులు చెబుతున్నారు. సో చదివారుగా మీరు కూడా మీ బ్యాంకు అకౌంట్ తో ఆధార్ కార్డు లింక్ చేస్తునప్పుడు మీ ఆధార్ కార్డు నెంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయించుకోండి మూలం వి ట్యూబ్.


Click it and Unblock the Notifications