సోమవారం నాడు తగ్గిన పెట్రోల్ ధరలు ఈవిదంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత వారం భారీగా పతనమయ్యాయి.
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత వారం భారీగా పతనమయ్యాయి. సోమవారం నాడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లీటరుకు డీజిల్ ధర 41-43 పైసలకు పడిపోగా అలాగే పెట్రోల్ ధరలు 35 -37 పైసలు పడిపోయింది.దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు 74.49 రూపాయలు ఉండగా ఇది ఆదివారం రూ.74.84 రూపాయలు ఉంది పెట్రోలు ధర 69.29 రూపాయలకు చేరింది ఇది ఆదివారం నాడు రూ.69.70 రూపాయల వద్ద ఉందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం.

ముంబైలో పెట్రోలు సోమవారం నాడు లీటరుకు రూ .80.03 వద్ద విక్రయించబడ్డాయి. ముంబైలో డీజిల్ 43 పైసలు తగ్గి రూ .72.56 కు చేరింది.
చెన్నైలో, లీటరు పెట్రోలు రూ.77.32 రూపాయల వద్ద రిటైలింగ్ అయ్యాయి. కోల్కతాలో పెట్రోలు రూ.76.47 రూపాయల వద్ద విక్రయించబడ్డాయి. ఈ నగరాల్లో డీజిల్ ధర రూ.73.20 రూపాయలు, రూ.71.14 రూపాయల వద్ద విక్రయించింది. నోయిడాలో పెట్రోల్ సోమవారం రూ.73.45 రూపాయలు,ఇది ఆదివారం రూ.73.79 వద్ద ఉండగా, డీజిల్ రూ.68.35 రూపాయల నుండి తగ్గి రూ.67.93 రూపాయలకు చేరింది.
అలాగే నవంబర్ నెలలో పెట్రోలు ధరలు లీటరుకు 5 రూపాయలకు పడిపోయాయి. డీజిల్ దేశంలోని ప్రధాన నగరాల్లో దాదాపు రూ .4.70 చొప్పున తగ్గింది. ఇటీవల ఇంధన ధరలు తగ్గడం వినియోగదారులకు ఒక పెద్ద ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు.
అంతర్జాతీయ ముడి చమురు ధరలు గత వారంలో భారీగా పతనం చోటు చేసుకున్నాయి. చమురు ధరలు శుక్రవారం 2018 నాటికి అత్యల్ప స్థాయికి పడిపోయాయి. ధరలు 8 శాతం దిద్దుబాటు తరువాత బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ డిసెంబరు 2017 నుంచి బ్యారెల్కు 59.04 డాలర్లుగా నమోదయ్యాయి.
ముడి చమురు ధరల విషయానికి వస్తే రిటైల్ ఇంధన ధరలు రానున్న రోజుల్లో భారతదేశంలో మరింత తగ్గుతాయని విశ్లేషకులు సూచిస్తున్నాయి.


Click it and Unblock the Notifications