For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జనవరి 1 నుంచి మీ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు పని చేయవు ఎందుకో తెలుసా?

By girish
|

పూర్వం మనకు డబ్బులు కావాలి అంటే మనం కచ్చితంగా బ్యాంకుకు పోవాల్సిందే. దీనితో ప్రజలు మరియు బ్యాంకు సిబ్బంది ఇద్దరు ఇబ్బంది పడేవారు. ఇది చూసిన RBI కొన్ని రోజుల తర్వాత ప్రజల ఇబ్బంది తొలగించాలి అని ఎటిఎం ఏర్పాట్లు చేసింది. ఇక డెబిట్ కార్డు మరియు క్రెడిట్ కార్డులు వాడుకలోకి వచ్చాయి.

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఏటీఎం కార్డు వినియోగదారులకు ఒక బాడ్ న్యూస్ మీ దగ్గరున్న పాత డెబిట్, క్రెడిట్ కార్డులను వెంటనే మార్చుకోండి. లేదంటే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పాత ఏటీఎం కార్డులు పనిచేయవు.అవునండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాల ప్రకారం మాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న పాత కార్డుల వ్యాలిడిటీ తీరిపోనుంది. ఇకపై ఆ కార్డులు పెట్టినా ఏటీఎంల్లో డబ్బులు రావు

పాత కార్డుల

పాత కార్డుల

పాత కార్డుల స్థానంలో కొత్తగా ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. పాత కార్డులు ఉన్న వినియోగదారులందరూ డిసెంబర్ 31లోపు పాత డెబిట్, క్రెడిట్ కార్డులను బ్యాంకులో సమర్పించి, కొత్త కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది.

కొత్త కార్డులను

కొత్త కార్డులను

2015, ఆగస్టు 27న రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులను పాత డెబిట్, క్రెడిట్ కార్డుల స్థానంలో కొత్త కార్డులను రీప్లేస్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం మూడేళ్ల సమయం కేటాయించింది. సెప్టెంబర్ 1, 2015 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించింది. అంతకు ముందు అంటే ఆగస్ట్ 31, 2015కు ముందు తీసుకున్న డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నవారు వెంటనే వాటిని బ్యాంకులో మార్చుకోవాల్సి ఉంటుంది.

బ్యాంకులు

బ్యాంకులు

16 నెంబర్ల కంటే ఎక్కువ నెంబర్లు ఉన్న ఏటీఎం కార్డులన్నీ మాగ్నెటిక్ స్ట్రిప్‌తో రూపొందించనవే. పాత కార్డులు మార్చుకోకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా వ్యాలిడిటీని పెంచుకునే అవకాశం ఉంది. నెట్ బ్యాంకింగ్‌లో ‘రిక్వెస్ట్ ఏటీఎం/డెబిట్ కార్డ్' ఆప్షన్ ఎంచుకుని ‘ఏటీఎం కార్డ్ రిప్లేస్‌మెంట్' సెలక్ట్ చేసుకోవాలి. లేదంటే నేరుగా బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి కార్డును మార్చుకోవాలి. ఇందుకోసం బ్యాంకులు ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు.

Read more about: atm
English summary

జనవరి 1 నుంచి మీ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు పని చేయవు ఎందుకో తెలుసా? | Credit and Debit Cards Will not Work From January 1st

We need money before we must go to the bank. This caused both people and bank staff to suffer. The ATM had arranged that the RBI had to remove people's trouble after a few days. Debit card and credit cards came into play.
Story first published: Monday, November 26, 2018, 10:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X