మనం ఆర్ధిక లావాదేవీలు చేయాలి అంటే కచ్చితంగా మనకు పాన్ కార్డు అవసరం. కానీ మనందరికీ పాన్ కార్డు అంటే ఏంటో తెలుసు కానీ ఈ-పాన్ కార్డు అంటే ఏంటో తెలుసా? అసలు ఎలా ఈ -పాన్ కార్డు అప్లై చేసుకోవాలి అసలు ఈ-పాన్ కార్డు అంటే ఏంటో చూద్దామా!ఈ-పాన్ కార్డు అప్లై చేసుకోవాలి అంటే చాలా సులభం మీకో ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుకు మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకొంటే చాలు మీరు ఈ -పాన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అర్హుహాలు ఇక ఈ-పాన్ కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఆదాయపు శాఖ వెబ్ సైట్ అంటే ఇన్కమ్ టాక్స్ వెబ్ సైట్ కి వెళ్లి చేసుకోవాలి.

కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది ప్రస్తుతానికి ఈ-కార్డు కంపెనీలకు, ట్రస్ట్ లకు , మైనర్లకు, వర్తించదు. పాన్అ కార్డు నేది అన్ని లావాదేవీలు, పన్ను చెల్లింపులు మరియు సంబంధిత రిటర్న్లను తెలుసుకోవటానికి, ధృవీకరించటానికి మరియు పరిశీలించటానికి వీలు కల్పిస్తుంది. పాన్ తప్పనిసరిగా ఉల్లేఖించిన కొన్ని లావాదేవీలు ఉన్నాయి
కొన్ని లావాదేవీలు
- రూ.10 లక్షల విలువైన స్థిరమైన ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం చేస్తే పాన్ కార్డు అవసరం.
- ఆర్బిఐ బాండ్లలో రూ. 50,000 దాటితే పాన్ కార్డు అవసరం.
- మీరు ఒక బ్యాంకు అకౌంట్ లేదా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు పాన్ కార్డు అవసరం.
- ఒక వాహనం కోనప్పుడు లేదా అమ్మినప్పుడు పాన్ కార్డు అవసరం.
- సంవత్సరానికి ఆదాయం పన్ను చెల్లించినట్లయితే ITR దాఖలు చేసే సమయంలో కూడా పాన్ కార్డు అవసరం.
అసలు ఈ-పాన్ కార్డు అంటే ఏంటి?
అసలు ఈ- పాన్ కార్డు అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో జారీ చేసిన డిజిటల్ సంతకంతో తయారు చేయబడిన ఒక కార్డు.ఇక ఇది జూన్ 29 నుంచి అమలులోకి వస్తుంది. ఇక మాములు పాన్ కార్డు కావాలి అంటే కొన్ని పత్రాలు సమర్పించాలిసి ఉంటుంది. ఇక ఈ-కార్డు ఉచితంగా వస్తుంది.
ఇక ఈ-పాన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి:
ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు ఉంటే అది మీ మొబైల్ నెంబర్ కి లింక్ అయివుంటే చాలు మీరు ఈ-పాన్ కార్డు కు అప్లై చేసుకోవచ్చు ఇన్కమ్ టాక్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి
ఇక KYC కూడా మీకు OTP ద్వారా మీరు ఆధార్ కార్డుకు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు.
మద్దతు పత్రాలను అందించాల్సిన అవసరం లేకుండా, ఇ-పాన్ ఆధార్ డేటాబేస్ నుండి సేకరించిన సమాచారం ఆధారంగా జారీ చేయబడుతుంది.
కానీ ఎక్కడ మీరు ప్రధానంగా చేయవలసిన పనులు ఏంటి అంటే మీ సంతకం మరియు మీ ఫోటోలు అప్ లోడ్ చేయాలి ఈ-పాన్ కార్డు భౌతికంగా లభించదు.


Click it and Unblock the Notifications