For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1 కే ఒక్క కిలో ఉల్లి భారీగా పడిపోయిన ధరలు త్వరపడండి

By girish
|

ఈరోజుల్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే ఒక్కో చోట ఒక్కో ధర పల్లె లో ఒక ధర, పట్టణంలో ఒక ధర అలాగే మెట్రో నగరాలలో ఒక్కో ధరలతో లభిస్తున్నాయి. ఇక కూరగాయలలో రారాజు ఉల్లి ఎంతగా అంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని ఒక సామెత కూడా ఉంటుంది. కానీ నిన్న జరిగిన ఘటనలో ఉల్లి ధర పేక మేడలాగా కూలిపోయింది. ఏంటో చూద్దాం.

రూ.1 కే ఒక్క కిలో ఉల్లి భారీగా పడిపోయిన ధరలు త్వరపడండి

అకస్మాత్తుగా పడిపోయిన ఉల్లి ధరలు రైతన్నను కన్నీరు పెట్టిస్తున్నాయి. మంచి ధర వస్తుందని పంట వేసిన ఉల్లి రైతులు తాజా ధరలు చూసి బావురుమంటున్నారు. కర్ణాటక హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో అక్కడ కిలో ఉల్లి రూ.1 ధర పలుకుతోంది. వారం కింద రూ.500 పలికిన క్వింటాల్ ఉల్లి రూ.100కు పడిపోయింది.

తాజా పరిస్థితికి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ఎక్కువగా పండించే బెల్గాం, బిజాపూర్, బాగల్‌‌కోట్, ధార్వాడ్, హవేరీ, గడగ్, దేవనగరె, చిత్రదుర్గ జిల్లాల్లో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి హోల్‌సేల్ దుకాణాలకు భారీ సంఖ్యలో ఉల్లి చేరుకోవడంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గీయులు చెబుతున్నారు. కర్ణాటకలో ఈ సారి ఉల్లి పంట బాగా పండింది. అయితే, ఇటీవల తమిళనాడును 'గజ' తుఫాన్ వణికించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ఉల్లి ఎగుమతి నిలిచిపోయింది. దీంతో తమిళనాడుకు వెళ్లాల్సిన సరకు నిలిచిపోవడం, కర్ణాటక నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ఉల్లి భారీగా వచ్చిపడటంతో ధరలు అమాంతంగా తగ్గిపోయాయి.

Read more about: money
English summary

రూ.1 కే ఒక్క కిలో ఉల్లి భారీగా పడిపోయిన ధరలు త్వరపడండి | Onion Price Down to Rs.1 Per Kilo

Vegetables prices are high today, at a price of one price per kilo, one in town and one in metropolitan cities
Story first published: Friday, November 23, 2018, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X