రూ.10 కే సంచి నిండా కూరగాయలు అదరగొడుతున్న వైస్సార్ ఎమ్మెల్యే మీరే చూడండి.

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అల్లా రామకృష్ణ రెడ్డి ఈ పేరు విజయవాడ మరియు గుంటూరు పరిసర ప్రాంతాలలో తెలియని వారు ఉండరు. ఎందుకలా అని అంటారా ఈయన మన ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే.

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి

ఈయన స్వతహాగా దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వీరాభిమాని ఎంత అంటే అయన మరణించిన తర్వాత కూడా అయన ఇచ్చిన మాట కోసం అయన పేదలకు ఇచ్చిన మాట ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే అల్లా రామకృష్ణ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారు.

 భోజనం

భోజనం

నిన్న అంత కేవలం రూ.4 కే కడుపు నిండా భోజనం అందిచారు. ఈ సేవతో రామకృష్ణ రెడ్డి గారికి పెద్దలలో మంచి పేరు వచ్చింది.అలాగే అయన కూడా ఎమ్మెల్యే లాగా ఎప్పుడు వ్యవహరించారు అని నిత్యం కష్టపడే రైతులాగే ఉంటారు అని మంగళగిరి ప్రజలు చెబుతున్నారు.

రాజన్న రైతు బజారు

రాజన్న రైతు బజారు

తాజాగా ఇప్పుడు రామకృష్ణ రెడ్డి గారు రాజన్న రైతు బజారు పేరుతో రూ.10లకే సంచి నిండా ప్రజలకు కూరగాయలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.అతి తక్కువ ధరలకే కూరగాయలు లభించడంతో జనం ఎగబడుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే అల్లా రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ రాజన్న రైతు బజారు ప్రారంభించడం వెనుక రెండు ఉద్దేశాలు ఉన్నాయని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

పెరిగిపోతున్న కూరగాయల ధరల నుంచి వినియోగదారులకు ఊరట కలిగించడం మొదటి ఉద్దేశం కాగా, రెండోది నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తుచేయడానికి వ్యాఖ్యానించారు. అలాగే, సీఎం ముందు రాష్ట్రంలో పాలనపై దృష్టిసారించాలని, తర్వాతే జాతీయస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూటమి ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు.

అనూహ్య స్పందన

అనూహ్య స్పందన

ఎమ్మెల్యే ప్రారంభించిన రాజన్న రైతు బజార్‌కు అనూహ్య స్పందన రావడంతో కూరగాయలు పండించే స్థానిక రైతులు పేదలకు సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

మద్దతుగా

మద్దతుగా

పేదలకు మద్దతుగా ఉండాలనే సంకల్పంతో రాజన్న మార్కెట్ ప్రారంభించడం సంతోషకరమని స్థానిక న్యాయవాది సీతారామి రెడ్డి తెలిపారు. అనేక మంది రైతులు, భూస్వాములు ఉచితంగా కూరగాయలు సరఫరా చేయడంతోపాటు తక్కువ ధరకే వాటిని అందజేస్తున్నారు. స్థానిక మార్కెట్‌లో ధరలు మండిపోతున్నాయని, ఇక్కడ మాత్రం ఏడు రకాల కూరగాయలు కేవలం రూ.10 లకే వస్తున్నాయని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జోరుగా వాన

జోరుగా వాన

ఈ కూరగాయలు అమ్ముతుంటే హఠాత్తుగా జోరుగా వాన కురిసింది అయినా కూడా పేద ప్రజలు వానని కూడా లెక్క చేయకుండా వానలోనే నిలబడి కొన్నారు. ఇది చూసి రామకృష్ణ రెడ్డి గారు తన పేస్ బుక్ లో ఇలా పోస్ట్ చేసాడు "ఈరోజు..పూర్తిగా అర్ధమయ్యింది..రాజన్న రాజ్యం కోసం పేదవారు ఎంతగా ఎదురుచూస్తున్నారో అని...వర్షం..పేదరికానికి ఏమాత్రం అడ్డంకి కాదని...జై జగన్...జోహార్ వైస్సార్"

రైతు బజార్‌

రైతు బజార్‌

పేదల కోస‌మే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరుతో రాజ‌న్న రైతు బ‌జార్ ఏర్పాటు చేశామ‌ని మంగళగిరి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ రైతు బ‌జార్ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంద‌ని ఆయ‌న తెలిపారు. రాజన్న రైతు బజార్‌ ప్రారంభించి పేదలకు 10 రూపాయలకే కూరగాయలు అందిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పటికే రాజన్న క్యాంటిన్లు ఏర్పాటుచేసి రూ.4కే భోజనం అందిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల మరో అడుగు మందుకేశారు.పేద ప్రజలు వారం రోజులు పాటు కూరగాయాలతో భోజనం చేసేవిధంగా రైతు బజార్‌ను ప్రారంభించారు.

800 కుటుంబాలు

800 కుటుంబాలు

మంగళగిరి 22వ వార్డు రత్నాల చెరువు వద్ద ప్రారంభించారు.రైతు బజార్‌కు విశేషమైన స్పందన వస్తోంది. ఆదివారం ఒకరోజే సుమారు 800 కుటుంబాలు కూరగాయాలు కొనుగోలు చేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల మాట్లాడుతూ రైతు బజార్‌కు పునరవైభవం తీసుకొస్తానని చంద్రబాబు మేనిఫెస్టో 43వ పేజీల్లో స్పష్టంగా పేర్కొన్నారని,కూరగాయలను ప్రతి సామాన్యుడికి అందేలా ధరలను నియంత్రిస్తానని పేర్కొన్నారని నాలుగున్నరేళ్లు అవుతున్న చంద్రబాబు ఆ దిశగా ఆలోచన చేయలేదన్నారు.రాజధానిలోనే పేదలను పట్టించుకోవడం లేదని విమర్శించారు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+