గురువారం భారతీయ రూపాయి విలువ వరుసగా ఏడవ సెషన్ లో బలోపేతం అయ్యింది, 2017 ఫిబ్రవరి నుండి దాని సుదీర్ఘమైన విజయాల పరంపరను బలపరిచింది.
గురువారం భారతీయ రూపాయి విలువ వరుసగా ఏడవ సెషన్ లో బలోపేతం అయ్యింది, 2017 ఫిబ్రవరి నుండి దాని సుదీర్ఘమైన విజయాల పరంపరను బలపరిచింది. ముడి చమురు ధరలు పడిపోవడం వల్ల ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణ భయాలు తగ్గడం సానుకూల ప్రభావం చూపింది. రూపాయి మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది, గత ఏడు సెషన్లలో దాదాపు 2 శాతం లాభపడింది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.48 శాతం పెరుగుదలతో 71.12 వద్ద ట్రేడవుతోంది.

రూపాయి మంగళవారం ముగింపు స్థాయి 71.46గా ఉంది. కాగా ఇండియన్ రూపాయి గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.14 వద్ద ప్రారంభమైంది.సెలవుదినం కారణంగా బుధవారం నాడు మనీ మార్కెట్లు మూతబడ్డాయి. భారత్‌లో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 7.755 శాతంగా ఉన్నాయి. బాండ్ ఈల్డ్స్ మునపటి ముగింపు స్థాయి 7.793 శాతంగా ఉంది.బాండ్ దిగుబడి మరియు ధరలు వ్యతిరేక దిశల్లో కదులుతాయి.
బుధవారం, బ్రెంట్ క్రూడ్ ధరలు డిసెంబరు 2017 నుంచి అత్యల్ప స్థాయి 6 శాతానికి పడిపోయాయి. ఇప్పటి వరకు ముడి చమురు 5.49 శాతం తగ్గింది. అదే 2018 గరిష్ట స్థాయి 86.29 డాలర్ల (బ్యారెల్‌కు) నుంచి చూస్తే ఏకంగా 26.8 శాతంమేర పతనమయ్యాయి.
బెంచ్మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ 0.16 శాతం, లేదా 56.75 పాయింట్లు పెరిగి 35,831.63 పాయింట్లకు చేరుకుంది.
ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి విలువ 10.6 శాతం క్షీణించింది. విదేశీ పెట్టుబడిదారులు వరుసగా 5.03 బిలియన్ డాలర్లు, 7.58 బిలియన్ డాలర్లు ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విక్రయించారు.
ఆసియా కరెన్సీలు అధిక వర్తకం ట్రేడ్ ఐయ్యాయి. దక్షిణ కొరియా 0.19%, ఫిలిప్పీన్స్ పెసో 0.1%, ఇండోనేషియా రుపయా 0.1%, జపాన్ యెన్ 0.07%, హాంకాంగ్ డాలర్ 0.05%. అయితే, థాయ్ బట్ 0.16 శాతం, చైనా రాంమిబి, సింగపూర్ డాలర్లు 0.06 శాతం పడిపోయాయి.
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్ ఇండెక్స్ తన మునపటి ముగింపు స్థాయి 96.712తో పోలిస్తే 0.08 శాతం క్షీణతతో 96.633 వద్ద ట్రేడవుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications