ఇప్పుడు ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులకి తక్కువ మొత్తంలో వేతనాలు వచ్చేవి అలాగే ఇలా కాంట్రాక్టు ఉద్యోగం చేసుకుంటూ పెర్మనెంట్ ఉద్యోగానికి వేచి చూసేవారు.
కానీ ఒకసారి రాష్ట్రం విభజించిన తర్వాత కేవలం కాంట్రాక్టు ఉద్యోగులకు కాదు అన్ని రంగాల ఉద్యోగులకి ఎన్నో వరాలు వచ్చాయి. ప్రధానంగా 2014 ఎన్నికలలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటిలో కాంట్రాక్టు ఉద్యోగులకి ఎన్నో వరాలు ఇచ్చారు అది ఏంటి అంటే కాంట్రాక్టు ఉద్యోగుల్ని పెర్మనెంట్ చేస్తాము అని చెప్పారు.
కానీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను పట్టించుకోలేదు అని ప్రభుత్వ అన్ని రంగాల కాంట్రాక్టు ఉద్యోగులు పెర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలి అని ధర్నాలు కూడా చేశారు.

తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాలు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జరిగిన మంత్రివర్గ ఉపసంఘంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రుల గంటా శ్రీనివాసరావు, ఫరూక్‌తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్ సబ్‌కమిటీ. ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులకు నెలకు రూ. 10 వేల చొప్పున వేతనం ఇస్తుండగా ఇకపై నెలకు రూ. 12 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచారు. మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు 6 నెలలు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది కేబినెట్ సబ్ కమిటీ. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఎవరినీ రెగ్యులరైజ్ చేయలేమని తేల్చిచెప్పారు మంత్రులు... కానీ, కాంట్రాక్టు ఉద్యోగులను ఎవరినీ తొలగించబోమని స్పష్టం చేశారు. కేబినెట్‌లో చర్చించి దీనికి ఆమోదం తెలుపుతామని వెల్లడించారు. వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తుండగా. వారందరికీ తీపికబురు అందిస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications