పెట్రోల్ ధరలు:నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి.
పెట్రోలు, డీజిల్ ధరలు బుధవారం మారలేదు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి విలువ అమెరికా డాలర్ పై పుంజుకోవడం వంటి కారణాలవల్ల గత ఆరు రోజులుగా ధరలు తగ్గాయి.
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు బుధవారం మారలేదు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి విలువ అమెరికా డాలర్ పై పుంజుకోవడం వంటి కారణాలవల్ల గత ఆరు రోజులుగా ధరలు తగ్గాయి. మంగళవారం నాడు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోల్, డీజిల్ పై ధర రూ.12-15 పైసలు పడిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.76.38 రూపాయలు, డీజిల్ రూ.71.27 రూపాయలకు రిటైలింగ్ అయింది. అదేవిధంగా,ముంబైలో పెట్రోల్ ధర రూ.81.90 రూపాయల వద్ద ఉంది మరియు డీజిల్ రూ.74.66 రూపాయలకు విక్రయించబడింది.
నవంబరులో పెట్రోలు ధరలు ఇప్పటివరకు లీటరుపై దాదాపు 3 రూపాయలు తగ్గాయి. డీజిల్ ధర లీటరుకు రూ .2 చొప్పున తగ్గింది.
చెన్నైలో పెట్రోలు రూ.79.31 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ ధర లీటరుకు రూ. 75.31 వద్ద ఉంది, కోల్కతా లో పెట్రోల్ ధర రూ .78.33 రూపాయలు ఉండగా, డీజిల్ ధర రూ .75.31 వద్ద ఉంది.
నోయిడాలో పెట్రోలు ధర రూ.74.94 రూపాయలు, డీజిల్ ధర రూ .69.63 చొప్పున విక్రయించింది.
బ్రెంట్ ముడి చమురు ధరలు గత కొద్ది రోజుల నుంచి బ్యారెల్ స్థాయి సుమారు 66 డాలర్లకు చేరుకుంది.కానీ బుధవారం ధర మరోసారి పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఆసియా మార్కెట్లో బ్యారెల్ మార్కు 63 డాలర్లకు చేరుకున్నాయి.వచ్చే రోజుల్లో ఇంధన ధరలు మరింత తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అక్టోబరు ప్రారంభంలో ముడి ధరలు దాదాపు 25 శాతం పెరిగాయి. సరఫరా పెరుగుదల, డిమాండ్ పెరుగుదలలో మందగించడం వల్ల ధరలు తగ్గాయి.


Click it and Unblock the Notifications