తెలంగాణాలో ఎన్నికల యుద్ధం మొదలయ్యింది ఒక పక్క కాంగ్రెస్ కూటమి కూడా అదే విధంగా పోటీ ఇస్తోంది. ఇక పోటీలో ఉన్న రాజకీయ నాయకులూ ఒక వైపు నామినేషన్లు మరో వైపు ప్రచారాలు మొదలు పెట్టారు.
ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మొన్న నామినేషన్ వేసి అప్పుడే ప్రచారాలు కూడా మొదలు పెట్టాడు.

ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం సిద్ధిపేటలో టీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రుణమాఫీ చేసి బ్యాంకుల్లో ఉన్న పాస్ పుస్తకాలను రైతులకు ఇప్పించామన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 8 వేలు ఇస్తూ.. ఇలా అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. గతంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉండేదని కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎంతో మెరుగైందని కేసీఆర్ పేర్కొన్నారు
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఏడాదికల్లా ప్రాజెక్టులు పూర్తి చేసుకొని కోటి ఎకరాలకు నీరు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. పంటకు డిమాండ్ ఉండాలంటే అగ్రికల్చర్ వర్శిటీ సూచనల ప్రకారం పంటల కాలనీ తయారు చేస్తామన్నారు. కాలనీ ఆధారంగా ప్రతీ రైతు పంట వేయాల్సి ఉంటుందన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని ఎక్కడికో వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇక ఉండదన్నారు. ప్రతి మండలంలో ఫుడ్ ఫ్యాక్టరీ యూనిట్ ఏర్పాటు చేసి అందులోనే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫుడ్ ఫ్యాక్టరీ యూనిట్ నడిపే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. ఫలితంగా మహిళలకు ఉపాధి దొరుకుతుందని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో హరీశ్ రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా సిద్ధిపేట ప్రజలను కోరారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications