మళ్ళీ కొద్దిగా తగ్గిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చూడండి
గత ఒక నెల ముందు వరకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరగగొట్టాయి. ఈ ధరలను భరించలేక సామాన్యుడు నుంచి ప్రతిఒక్కరు ధర్నాలు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ గత 30 రోజుల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ వార్త దేశంలో ఉన్న సామాన్యుల నుండి ధనవంతుడి వరకు అందరికి కొంచెం ధరల నుండి ఉపశమనం ఇస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలుకుని ఈ ఏడాదిలో అత్యధిక ధరలతో ఇబ్బందులు ఎదుర్కున్న ముంబై వరకు పలు మెట్రో నగరాల్లో స్వల్పమొత్తంలో తగ్గుదల నమోదైంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరలు 20 పైసలు తగ్గి రూ. 76.71కు చేరుకోగా, లీటర్ డీజిల్ ధర 18 పైసలు తగ్గి రూ.71.56కు చేరుకుంది. ఇక ముంబైలో ఇంధనం ధరల విషయానికొస్తే, లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు తగ్గి రూ. 82.23కు చేరుకోగా లీటర్ డీజిల్ 19 పైసలు తగ్గి రూ.74.97కు చేరుకుంది. నేడు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.33 కాగా లీటర్ డీజిల్ ధర రూ.77.86 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గడం ఇందుకు ఓ కారణమైతే, డాలర్ విలువతో పోల్చుకుంటే, ప్రస్తుతం రూపాయి కొంతమేరకు బలపడుతుండటం మరో కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈరోజు నగరాలలో నమోదైన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి.
నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ ₹ 76.38 ₹ 71.27
ముంబయి ₹ 81.90 ₹ 74.66
కోల్‌కతా ₹ 78.33 ₹ 73.13
చెన్నై ₹ 79.31 ₹ 75.31
బెంగళూరు ₹ 76.99 ₹ 71.65
హైదరాబాద్ ₹ 80.98 ₹ 77.54
విజయవాడ ₹ 80.26 ₹ 76.39


Click it and Unblock the Notifications