For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు పేటీఎం ఉందా? బంపర్ ఆఫర్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ డబ్బు వస్తుంది.

By girish
|

ఈరోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఇక స్మార్ట్ ఫోన్ ఉంటే పేటీఎం కచ్చితంగా ఉంటుంది ఇక పేటీఎం వాడుతున్నవారికి ఒక బంపర్ ఆఫర్
పేటీఎం నుంచి ట్రాన్సాక్షన్స్ చేయనివాళ్లుండరు. పేటీఎం కొత్తకొత్త స్కీమ్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది. అందులో ఒకటి పేటీఎం మనీ. దీని వల్ల లాభాలేంటో తెలుసుకోండి.

మీకు పేటీఎం ఉందా? బంపర్ ఆఫర్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ డబ్బు వస్తుంది.

1. పేటీఎం మనీ... పేటీఎం నుంచి ప్రారంభమైన కొత్త సర్వీస్. దీని ద్వారా మీరు మ్యూచ్యువల్ ఫండ్స్ కొనొచ్చు. ఇందుకోసం కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2023 నాటికి పేటీఎం ద్వారా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు 20 లక్షల నుంచి 50 లక్షలకు చేరొచ్చని అంచనా.

2. పేటీఎం మనీ లాంఛ్ కాకముందే 8,50,000 మంది యూజర్లు రిజిస్టర్ చేసుకోవడం విశేషం. అందులో 96 శాతం మంది మొబైల్ నుంచి చేసినవాళ్లే.

3. ఇందుకోసం మీరు పేటీఎం మనీ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ లేదా ఐఓఎస్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత డిజిటల్ కేవైసీ పూర్తి చేయాలి.

4. పేటీఎం 25 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, 90 అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. జీరో డిస్ట్రిబ్యూషన్ ఫీజు, జీరో కమిషన్‌తో వీటి మ్యూచువల్ ఫండ్స్ కొనొచ్చు.

5. కేవలం రూ.100 రూపాయల నుంచి సేవింగ్స్ కూడా మొదలుపెట్టొచ్చు. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది.

6. పేటీఎం మనీ యూజర్లు రూ.100 నుంచి ఎల్ఐసీలో లేదా సిస్టమెటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు. 190 బ్యాంకుల నుంచి ఆటో పేమెంట్ సౌకర్యం కూడా ఉంది.

7. ఇన్వెస్ట్‌మెంట్ సలహాల కోసం మార్నింగ్ స్టార్, క్రిసిల్, వ్యాల్యూ రీసెర్చ్ లాంటి టాప్ రేటింగ్ సంస్థలతో పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సేవలన్నీ ఉచితంగానే వస్తాయి.

8. లార్జ్ క్యాప్, మిడ్‌ క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాలెన్స్‌డ్, ట్యాక్స్ సేవింగ్స్, డెట్, లిక్విడ్ ఫండ్స్ లాంటివి పేటీఎం మనీలో లభిస్తాయి. మీ రిటర్న్స్‌ని కూడా ఇదే యాప్‌లో చూసుకోవచ్చు.

Read more about: paytm
English summary

మీకు పేటీఎం ఉందా? బంపర్ ఆఫర్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ డబ్బు వస్తుంది. | Paytm New Offer

Paytm Money ... A new service started from Paytm. You can buy mutual funds through this. The CVC will have to complete. By 2023, mutual fund investors are expected to reach between 20 lakh and 50 million by the Paytm.
Story first published: Monday, November 19, 2018, 12:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X