తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం నిలువలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే?

ఇక వివరాల్లోకి వెళితే రానున్న తెలంగాణా ఎన్నికల్లో మద్యం ప్రవాహం కోసం రంగం సిద్ధం చేసింది,రాష్ట్ర సరిహద్దుల్లో గ్రీన్ సిగ్నల్ కోసం వాహనాలు ఎదురుచూస్తున్నాయి.

ఇక వివరాల్లోకి వెళితే రానున్న తెలంగాణా ఎన్నికల్లో మద్యం ప్రవాహం కోసం రంగం సిద్ధం చేసింది,రాష్ట్ర సరిహద్దుల్లో గ్రీన్ సిగ్నల్ కోసం వాహనాలు ఎదురుచూస్తున్నాయి.అడపాదడపా పట్టుబడుతున్న మద్యం ఎన్నికల వేల ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తున్నాయి.

తెర వెనక నాయకులు:

తెర వెనక నాయకులు:

ఐతే దీని వెనక నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు ఏ పార్టీ నాయకులు ఎంతెంత ఆఫర్ ఇచ్చారో తెలియాల్సిఉంది.ఈ నేపథ్యం లో మద్యం ప్రవాహానికి అడ్డుకట్టవేయడానికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

తెలంగాణ ఎన్నికలు:

తెలంగాణ ఎన్నికలు:

రాబోయే తెలంగాణ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి,ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.బలమైన అభ్యర్థిని రంగంలోకి దించే విషయం నుండి పేకట్బంధీ ప్రచారం వరకు అన్ని ప్లాన్ ప్రకారం చేస్తున్నాయి.

కొత్త ఎత్తులు:

కొత్త ఎత్తులు:

ఇక ఎన్నికలు దగ్గరపడేకొద్దీ కొత్త ఎత్తులు ప్రలోభాల పరువాలకు సిద్ధమవుతున్నాయి పార్టీలు,ఈ క్రమంలోనే కట్టలకొద్దీ డబ్బు పంపిణి డ్రమ్ముల కొద్దీ మద్యం పంచిపెట్టేందుకు అన్ని పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు.తాము చేసే అభివృద్ధి కార్యక్రమాలు కుల సంగాల ఓట్లు పార్టీ అభిమానుల ఓట్ల కన్నా డబ్బు,మద్యం పుష్కలంగా ఉంటే చ్చలు గెలవడం చాల ఈజీ అంటున్నాయి రాజకీయ పార్టీలు.

బ్రాలోబాలకు గురిచేసి:

బ్రాలోబాలకు గురిచేసి:

డబ్బు,మద్యం ఎర చూపి జనాలను తమ వైపు తిప్పుకునేందుకు ఎంతటికైనా తెగిస్తామంటున్నాయి,గత ఎన్నికల కాని ఈసారి పెద్ద మొత్తంలో డబ్బు మరియు మద్యానికి నేతలు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం గమనార్హం.దీన్ని అరికట్టేందుకు ఎలక్షన్ కమిషన్ అప్రమత్తమైనది.

మద్యం నియంత్రణ:

మద్యం నియంత్రణ:

మద్యాన్ని నియంత్రణ చేయాలంటూ ఎక్సయిజ్ అధికారులకు EC ఆదేశాలు జారీ చేసింది,ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా రంగంలోకి దిగిన ఎక్సయిజ్ శాఖ అధికారులు మద్యం షాపులు మరియు బెల్ట్ షాపులు,డిపోలు అలాగే బ్యావరేజెస్ కంపెనీలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

స్పష్టమైన లెక్కలు:

స్పష్టమైన లెక్కలు:

మద్యం అమ్మకాలపై స్పష్టమైన లెక్కలు చూపాలంటూ అందుకు ఎప్పటికప్పుడు ఇన్వాయిస్ సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.అక్రమ మద్యం సరఫరా పై ఓటర్లు సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 18004252523 ను ఏర్పాటు చేసారు.ప్రతి బెల్ట్ షాపులో బ్రాండ్ల వారీగా అమ్మకాలను రిజిస్టర్ లో పొందు పరచాలని ఆదేశాలు జారీచేసింది ఎన్నికల కమిషన్.

సిసి కెమెరాలు:

సిసి కెమెరాలు:

ప్రతి మద్యం షాపులో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది,మద్యం అమ్మకాలపై ఎప్పటికప్పుడు ఆరాతీసి కేంద్రానికి నివేదికలు ఎన్నికల అధికారులు అందించేలా ప్రణాలికను సిద్ధం చేసారు.ఎన్నికల నేపథ్యంలో ఎక్సయిజ్ అధికారులు అలాగే ఎన్నికల అధికారులు నిఘా పెంచడంతో నేతలంతా పక్క రాష్ట్రాలపై ఆసక్తి చూపుతున్నారు.

ఇతర రాష్ట్రాల నుండి:

ఇతర రాష్ట్రాల నుండి:

ఇతర రాష్ట్రాల నుండి పెద్ద మొత్తం లో సరుకు దిగుమతి చేసుకొని శివారు ప్రాంతాల్లో గుట్టుగా దాచిపెట్టినట్టు తెలుస్తోంది.ఈ దాచిన నిలువల విలువ కొన్ని కోట్లలో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.ఐతే సరుకు ఎప్పుడు ఎలా తరలించాలి అనే ప్రణాళికల్లో నేతలు మునిగిఉన్నారు.

సోదాల్లో పట్టుబడిన మద్యం విలువ:

సోదాల్లో పట్టుబడిన మద్యం విలువ:

ఐతే ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.6.66 కోట్ల విలువచేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.పట్టుబడిన మద్యం వ్యవహారాలపై అధికారులు ఆరాదిస్తే ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులకు చెందిన వ్యక్తులు దిగుమతి చేస్తునట్టు తెలిసింది.కర్ణాటక మరియు మహారాష్ట్రల నుండి పెద్దఎత్తున మద్యం తెలంగాణాకు రవాణా అవుతున్నట్టు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+