ఆంధ్రప్రదేశ్ కి మరో భారీ పరిశ్రమ.కియా తరువాత అత్యంత భారీ పెట్టుబడి ఇదే?

రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ అప్పుల తో బయటకు వచ్చింది కనీసం రాజధాని కూడా లేదు,గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది.

రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ అప్పుల తో బయటకు వచ్చింది కనీసం రాజధాని కూడా లేదు,గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది దేశ విదేశాలనుండి ఎన్నో పరిశ్రమలు ఐటి కంపెనీలు హైదరాబాద్ కి క్యూ కట్టాయి తద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది.ఇక రాష్ట్రం విడిపోయాక మొత్తం కంపెనీలు అన్ని హైదరాబాద్ లో ఉండిపోయాయి.

ఆంధ్రప్రదేశ్:

ఆంధ్రప్రదేశ్:

కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాడు.తనకున్న రాజకీయ అనుభవంతో అభివృద్ధి లో ఆంధ్రప్రదేశ్ ని పరుగులు పెట్టించాడు.పలు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

కియా మోటర్స్:

కియా మోటర్స్:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ పరిశ్రమ దేశంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో ఏర్పాటు చేసింది.అనంతపురం జిల్లాలోని పెనుగొండ మండలం యర్రంచీ గ్రామంలో కంపెనీ తన అతిపెద్ద ఉత్పాదన కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. కియా ఇప్పటికే దాని తయారీ కేంద్రంలో $ 1.1 బిలియన్లు పెట్టుబడి పెట్టింది, మరియు ఇది తుది దశలో ఉంది.

ఆసియ పల్ప్ పేపర్ గ్రూప్:

ఆసియ పల్ప్ పేపర్ గ్రూప్:

ఇండోనేషియాకు చెందిన అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజం ఆసియ పల్ప్ పేపర్ గ్రూప్ అనుబంధ సంస్థ సీనార్మాస్ గ్రూప్ రాష్ట్రం లోని ప్రకాశం జిల్లాలో పరిశ్రమను స్థాపించనుంది.ఈ సంస్థ రెండు దశల్లో రూ.21,600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

పేపర్ తయారీలు:

పేపర్ తయారీలు:

ఈ పరిశ్రమ నుండి టిష్యు,ప్యాకింగ్ పేపర్ తయారీ పరిశ్రమను రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలనీ నిర్వాహకులు నిర్ణయించారు.ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలను ఇప్పటికే ప్రతినిధుల బృందం పరిశీలించింది.ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

ప్రాథమిక నివేదిక:

ప్రాథమిక నివేదిక:

దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చిన కంపెనీ నిర్వాహకులు నెలాఖరులో ముఖ్యమంత్రికి DPR అందజేయనున్నారు.అందుబాటులో సుబాబుల్,యూకలిప్ట్స్ కర్రలను ఉపయోగించి పేపర్ పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను నిర్వాహకులు ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడం తో పరిశ్రమల శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

ముడి సరుకు:

ముడి సరుకు:

ముడి సరుకు కలిగిన ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు ఇటీవల సీనార్మాస్ గ్రూప్ ప్రతినిధుల బృందాన్ని తీసుకెళ్లారు,ప్రపంచవ్యాప్తంగా టిష్యు మరియు ప్యాకింగ్ పేపర్ కు మంచి డిమాండ్ ఉండటం కారణంగా ఎగుమతులకు వీలుగా వూడరేవుకు సమీపంలో భూములు కావాలన్నా నిర్వాకుల సూచనలపై రామాయపట్నం లోని పలు ప్రాంతాలను చూపించారు.

ప్రాభుత్వం తరపున:ప్రాభుత్వం తరపున:

ప్రాభుత్వం తరపున:ప్రాభుత్వం తరపున:

రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో వచ్చేవారికి ప్రభుత్వం తరపున కల్పిస్తున్న రాయితీలు ప్రోత్సాహకాలను అధికారులు వివరించారు,పలు అంశాలను పరిగణంలోకి తీసుకోని ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రాథమిక నిర్ణయానికి సీనార్మాస్ గ్రూప్ వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.

దశల వారిగా:

దశల వారిగా:

సంస్థ మొదటి దశలో రెండు బిలియన్ల అలాగే రెండవ దశలో ఒక బిలియన్ డాలర్లతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమతో 6000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి .ఇదే తరహాలో రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+