For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇషా అంబానీ అత్తగారు ఇచ్చిన గిఫ్ట్ రూ.450 కోట్లు చూస్తే షాక్ అవుతారు.

By girish
|

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కుమార్తె ఈషా అంబానీ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 12న ఆమె పెళ్లి అజయ్‌ పిరమాల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమాల్‌తో జరగబోతోంది. పెళ్లి వేడుక ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై ఊహాగానాలు వస్తున్న సమయంలో, ముంబయిలోని ముకేశ్‌ అంబానీ స్వగృహంలోనే ఈ వేడుక ఉండబోతోందని ఇరు కుటుంబ వర్గాలు ధ్రువీకరించాయి.

పెళ్లి తంతు

పెళ్లి తంతు

పెళ్లి తంతు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. వివాహ వేడుకకు ముందు వారాంతంలో అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఉదయ్‌పుర్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేయబోతున్నారు. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈషా, ఆనంద్‌ల జంటకు ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నారు.

వెడ్డింగ్ కార్డు

వెడ్డింగ్ కార్డు

ఇషా వెడ్డింగ్ కార్డు రెండు బాక్సుల్లో అందంగా అమర్చారు. అంబానీ ఫ్యామిలీకి తగ్గట్టు పెళ్లికార్డును డిజైన్ చేశారు. ఒక బాక్సులో వధువు వరుడు పేర్లను ఉంచి పూలతో అందంగా డెకరేట్ చేశారు. మరో బాక్సులో నాలుగు చిన్న బంగారు బాక్సులు ఉన్నాయి. అందులో ఒక చిన్న బాక్సులో సరస్వతి దేవీ విగ్రహాన్ని ఉంచారు . తమ హోదాకు ఏమాత్రం తగ్గకుండా మ్యారెజ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించింది అంబానీ ఫ్యామిలీ అంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

అత్తింటి వారు

అత్తింటి వారు

ఇక ఈశాకు అత్తింటి వారు అద్భుతమైన కానుక సిద్ధం చేశారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో పిరమాల్‌ కుటుంబం పేరిట ఉన్న రూ.450 కోట్ల విలువైన గులీటా భవనాన్ని ఆమెకు ఇవ్వనున్నారట. అజయ్‌, స్వాతి పిరమాల్ దంపతుల కుమారుడు ఆనంద్‌‌ను ఈశా వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత నూతన దంపతులు ఇదే భవనంలో నివసించచనున్నారు. ప్రస్తుతం భవన సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.

పిరమాల్‌ సంస్థ వారసుడు

పిరమాల్‌ సంస్థ వారసుడు

పిరమాల్‌ సంస్థ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌, ఈశా అంబానీ నిశ్చితార్థం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇటలీలోని లేక్‌ కోమో వేదికగా మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది. డిసెంబర్‌ 12న వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

భవనం ప్రత్యేకతలు:

భవనం ప్రత్యేకతలు:

  • ఈ ఐదంతస్తుల భవనం అరేబియా సముద్రానికి అభిముఖంగా అత్యద్భుతంగా ఉంటుంది.
  • ముంబైలో ఇప్పటివరకు అత్యంత పేరున్న భవనం యాంటిలియా. ఇప్పుడు ఈ జాబితాలో గులీటా కూడా చేరనుంది.
  • గులీటా 50,000 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఈ భవనంలోని మొదటి అంతస్తులో విశాలమైన లాన్‌, మల్టీపర్పస్‌ గదులు, ఓపెన్‌ ఎయిర్‌ వాటర్‌ బాడీ సదుపాయాలుంటాయి. మిగిలిన అంతస్తుల్లో లివింగ్‌ రూమ్‌, భోజనశాలలు, బెడ్‌రూమ్స్‌, ట్రిపుల్‌ హైట్‌ మల్టీపర్పస్‌ గదులు ఉన్నాయి. అక్కడే లాంజ్‌ ఏరియాలు, డ్రెస్సింగ్‌ రూమ్‌లు ఉన్నాయి.
  • భవంతిలో పనివారి క్వార్టర్లు కూడా అక్కడే అందుబాటులో ఉన్నాయి.
  • వర్లీలోని హిందుస్థాన్ యూనిలీవర్‌కు చెందిన ఈ భవనాన్ని 2012లో జరిగిన వేలంలో పిరమాల్‌ కుటుంబం దక్కించుకొంది. నాటి నుంచి దీన్ని వివిధ రకాల శిక్షణ కేంద్రాలకు వినియోగిస్తున్నారు.
  • పిరమాల్‌ కుటుంబం దీన్ని ఆరేళ్ల కిందట వేలంలో దక్కించుకున్నా.. పూర్తి హక్కులు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌ 19న బదిలీ అయ్యాయి.
  • డిసెంబర్‌ 12న

    డిసెంబర్‌ 12న

    డిసెంబర్‌ 1న ఈ భవనంలో పూజ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 12న నూతన దంపతులు ఇందులోకి ప్రవేశించనున్నారు. ఈశా-ఆనంద్ వివాహ ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధమైపోయాయి. ఒక్కో ఆహ్వాన పత్రిక విలువ రూ. 3 లక్షలకు పైమాటేనని తెలుస్తోంది. ఈ పత్రికలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఖరీదైన పత్రికలను వీవీఐపీల కోసం సిద్ధం చేసినట్లు సమాచారం.

Read more about: mukesh ambani
English summary

ఇషా అంబానీ అత్తగారు ఇచ్చిన గిఫ్ట్ రూ.450 కోట్లు చూస్తే షాక్ అవుతారు. | Isha Ambani Marriage Gift

Isha Ambani's In-Laws Gift Her A 450 Crore Bungalow To Start Her Married Life With Anand Piramal
Story first published: Saturday, November 17, 2018, 11:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X