For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ నగరాల్లో డీజిల్ ధర కన్నా పెట్రోల్ ధరలు తక్కువగా నమోదయ్యాయి?

గోవా, గుజరాత్, ఒడిషా, అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో పెట్రోల్ ధర కంటే డీజిల్ ధరలు అధికంగా నమోదయ్యాయి. గోవాలో,పెట్రోల్ కంటే డీజిల్ ధర రూ.2 రూపాయలు అధికంగా ఉంది.

By bharath
|

న్యూఢిల్లీ: గోవా, గుజరాత్, ఒడిషా, అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో పెట్రోల్ ధర కంటే డీజిల్ ధరలు అధికంగా నమోదయ్యాయి. గోవాలో,పెట్రోల్ కంటే డీజిల్ ధర రూ.2 రూపాయలు అధికంగా ఉంది అలాగే గుజరాత్, ఒడిషా మరియు పోర్ట్ బ్లెయిర్లలో పెట్రోల్ కంటే డీజిల్ ధర రూ.1 రూపాయి అధికంగా ఉంది.

గ్యాస్ ఇంధన ధరల విధానం

గ్యాస్ ఇంధన ధరల విధానం

గతేడాది జూన్ నుంచి ప్రారంభమైన గ్యాస్ ఇంధన ధరల విధానం కింద ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రెండు ఇంధనాల ధరను రూ.30 కేవలం ఏడు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలచే అమ్మబడే అధిక అమ్మక పన్ను లేదా వ్యాట్ కూడా డీజిల్ యొక్క అధిక రిటైల్ ధరలకు దోహదం చేసింది.

అహ్మదాబాద్ మరియు సూరత్ లో

అహ్మదాబాద్ మరియు సూరత్ లో

అహ్మదాబాద్ మరియు సూరత్ లో, పెట్రోల్ కంటే డీజిల్ ధర రూ.1 రూపాయి ఎక్కువగా ఉంది.గుజరాత్ ప్రభుత్వం 22.19% పెట్రోల్ పై పన్ను విధించింది అలాగే డీజిల్ పై 22.28% పన్ను విధించింది.

ఒడిశా లో పెట్రోల్ పై పన్ను 24.63%, డీజిల్ పై 25.08% ఉంది.భువనేశ్వర్ లేదా కటక్లో ఇంధనాన్ని కొనుగోలు చేస్తే డీజిల్ పై అధికంగా రూ.1.2 రూపాయలు చెల్లించాలి.

కేంద్రపాలిత ప్రాంతాల్లో

కేంద్రపాలిత ప్రాంతాల్లో

అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలలో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంధనాలపై అత్యల్ప వేట్ను వసూలు చేస్తోంది.ఇక్కడ రేటు పెట్రోల్ మరియు డీజిల్ రెండింటిలోనూ

6% పన్ను వసూలు వర్తిస్తుంది.పెట్రోల్ ధర రూ.66.48 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.67.34 వద్ద ఉంది.రెండింటిలో 14 పైసలు తేడా.

డీజిల్, పెట్రోల్ దాదాపుగా ఒకే ధర ఉన్న ప్రాంతాలు:

డీజిల్, పెట్రోల్ దాదాపుగా ఒకే ధర ఉన్న ప్రాంతాలు:

ఛత్తీస్గఢ్లో పెట్రోలు, డీజిల్ ధరలు రెండూ కూడా సమానంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ. 75.20 అలాగే డీజిల్ రాయిపూర్లో రూ. 75.28 రూపాయల ధర ఉంది. ఈ వ్యత్యాసం రెండు ఇంధనాలపై వ్యాట్ల మధ్య ఇరుకైన గ్యాప్లో కూడా ప్రతిబింబిస్తుంది. పెట్రోలుపై వ్యాట్ 23.08 శాతం ఉండగా, డీజిల్ పై 21.84 శాతం ఉంది.

ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం:

ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం:

పెట్రోల్ మరియు డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం ఇక్కడ మెల్లగా మారిపోతుందని భారతదేశం యొక్క అత్యంత ప్రధాన నగరాల ధరల ధోరణి విశ్లేషణ తెలుపుతుంది. ఢిల్లీలో డీజిల్ పై రూ.5 రూపాయలు తక్కువ ఉంది, ముంబై లో రూ 7 రూపాయలు, చెన్నై లో రూ 4 రూపాయలు,బెంగళూరు లో రూ .5 రూపాయలు మరియు కోల్కతా లో రూ .5 రూపాయలు అలాగే హైదరాబాద్ లో రూ.3.5 రూపాయల ధరలు తక్కువ ఉన్నాయి.

రాంచీలో పన్ను రేటు వ్యత్యాసం కేవలం రూ.1 రూపాయి మాత్రమే అలాగే జార్ఖండ్ ప్రభుత్వ పన్నులు పెట్రోల్ పై (21.52 శాతం) డీజెల్ కంటే ఎక్కువ (19.20 శాతం) విధించింది.

 2017 నవంబరు నెలలో

2017 నవంబరు నెలలో

ఒక సంవత్సరం క్రితం 2017 నవంబరు నెలలో ఢిల్లీలో ధరల గ్యాప్ 11 రూపాయలకుపైగా అలాగే ముంబైలో రూ .16 రూపాయలుగా నమోదైంది. ధరలు నెమ్మదిగా పెరగడంతో, గ్యాప్ తగ్గించడం కొనసాగింది.

డీజిల్ ధరలు పెరగడంతో డీజిల్ కార్ల అమ్మకాలు క్షీణించాయి:

డీజిల్ ధరలు పెరగడంతో డీజిల్ కార్ల అమ్మకాలు క్షీణించాయి:

పెట్రోల్ మరియు డీజిల్ మధ్య ధర వ్యత్యాసం ప్రత్యక్ష ప్రభావం వాహనాల అమ్మకంలో చూపింది.పెట్రోల్-డీజిల్ ధరల గ్యాప్ సమీకరణాలు మారాక, డీజిల్ కార్ల అమ్మకం ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టాయి.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎమ్) గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో భారతదేశంలో విక్రయించిన డీజిల్ కార్ల సంఖ్య తగ్గింది అని వెల్లడించారు. 2013-14లో, డీజిల్ కార్ల వాటా 42% గా ఉంది, ఇప్పుడు ఇది 2018-19 (సెప్టెంబర్ వరకు) లో 21% కి పడిపోయింది.

Read more about: petrol diesel
English summary

ఈ నగరాల్లో డీజిల్ ధర కన్నా పెట్రోల్ ధరలు తక్కువగా నమోదయ్యాయి? | Petrol Is Now Cheaper Than Diesel In These Cities

New Delhi: Not only has the price gap between the two automobile fuel has narrowed down to single digits in most cities but diesel has now become costlier than petrol in Goa, Gujarat, Odisha and Andaman and Nicobar Islands.
Story first published: Friday, November 16, 2018, 10:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X