గురువారం నాడు కూడా పెట్రోల్ ధరలు తగ్గుముకం పట్టాయి?
పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం మరోసారి తగ్గాయి. పెట్రోల్ పై ధర 14-16 పైసలు తగ్గించారు. డీజిల్ పై ధర 9-11 పైసలు పడిపోయింది.
పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం మరోసారి తగ్గాయి. పెట్రోల్ పై ధర 14-16 పైసలు తగ్గించారు. డీజిల్ పై ధర 9-11 పైసలకు పడిపోయింది. ఇప్పటివరకూ నవంబర్ లో పెట్రోలు ధరలు లీటరుకు రూ .2 రూపాయల మేర తగ్గాయి.డీజిల్ దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో రూ.1.70 రూపాయల చొప్పున తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీలో
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు రూ.77.28 రూపాయలు ఉంది బుధవారం రూ.77.43 రూపాయలుగా ఉంది అదేవిదంగా డీజిల్ ధర నిన్న రూ.72.19 రూపాయల నుండి తగ్గి నేడు రూ.72.09 రూపాయలకు విక్రయిస్తోందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం.

ముంబైలో పెట్రోలు ధర
అదేవిధంగా ముంబైలో పెట్రోలు ధర రూ.82.80 రూపాయల వద్ద విక్రయించగా, బుధవారం రూ .82.94 చొప్పున ధరలు నమోదయ్యాయి. డీజిల్ ధర 75.64 రూపాయల నుండి తగ్గి రూ.75.53 రూపాయలకు చేరుకుంది. చెన్నై, కోల్కతా వంటి ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర రూ.80.26 రూపాయలు, రూ.79.21 రూపాయల వద్ద విక్రయించగా, డీజిల్ రూ.76.19, రూ.73.95 రూపాయల వద్ద రిటైలింగ్ అయింది.
నోయిడాలో పెట్రోల్ ధర 75.65 రూపాయలుగా ఉంది. డీజిల్ ధర రూ. 70.33 గా ఉంది.

ముడిచమురు ధరలు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గురువారం తగ్గుముఖం పట్టడంతో ఇంధన ధరలు మరింత తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఆసియా మార్కెట్లో బ్యారెల్కు 65.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. గత ముగింపులో 22 సెంట్లు, లేదా 0.3 శాతం తగ్గాయి.

ధరలు మరింత తగ్గే అవకాశం
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ గత 15 రోజుల సగటు ముడి ధర ఆధారంగా నిర్ణయించబడతాయి మరియు డీలర్ కమిషన్తో పాటు రూపాయి-డాలర్ మారకం రేటు మరియు పన్నులు వంటివి రోజువారీగా మారదు.ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications