డాలర్ తో పోల్చి చూస్తే నేడు రూపాయి బాగా పుంజుకుంది.
బుధవారం ప్రారంభ ట్రేడింగ్ లో భారత రూపాయి విలువ 50 పైసలు పెరిగి 72.16 వద్ద ప్రారంభమైంది.కాగా రూపాయి మంగళవారం 72.67 వద్ద ముగిసింది.
బుధవారం ప్రారంభ ట్రేడింగ్ లో భారత రూపాయి విలువ 50 పైసలు పెరిగి 72.16 వద్ద ప్రారంభమైంది.కాగా రూపాయి మంగళవారం 72.67 వద్ద ముగిసింది.

ఇది దాదాపు 2 నెలల్లో అధిక వర్తకం. ఇది సెప్టెంబరు 21 తరువాత మొదటిసారి 72 కి చేరింది.
US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్కు 55.66 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 65 డాలర్లుగా ఉంది.
అంతకు ముందు ఒక్కరోజే 7 శాతం కన్నా ఎక్కువ పడిపోయింది. పదేళ్ల బాండ్ ధరలు 15 వారాల గరిష్ట స్థాయికి చేరాయి.
భారత్‌లో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 7.708 శాతంగా ఉన్నాయి. బాండ్ ఈల్డ్స్ మునపటి ముగింపు స్థాయి 7.804 శాతంగా ఉంది. బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. భారతదేశ ద్రవ్యోల్బణం గత నెలలో 3.7 శాతంగా నమోదయింది. గత నెలలో ఐఐపి 4.3 శాతం వృద్ధిని సాధించి సెప్టెంబర్లో 4.5 శాతం పెరిగింది అని మోతీలాల్ ఓస్వాల్ అన్నారు.
ప్రస్తుత సంవత్సరం మొత్తంగా చూస్తే రూపాయి 11.5 శాతంమేర పతనమైంది.ఆసియా ప్రధాన కరెన్సీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.29 శాతం, థాయ్ బట్ 0.26 శాతం, దక్షిణ కొరియా ఒన్ 0.11 శాతం, ఫిలిప్పిన్స్ పెసో 0.11 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.1 శాతం పెరిగాయి. అయితే జపాన్ యెన్ మాత్రం 0.1 శాతం తగ్గింది.
ఆర్‌బీఐ నవంబర్ 15న మార్కెట్‌లో లిక్విడిటీని పెంచేందుకు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31 శాతానికి తగ్గింది.


Click it and Unblock the Notifications