మీకు ఎక్కువ మందితో పరిచయాలు ఉండి, విజయం పొందాలనే తపన ఉంటే చాలు అంత ఎక్కువ మూలధనం లేదా పెట్టుబడి అవసరమే లేదు. తక్కువ పెట్టుబడితో చాలా వ్యపారాలను ప్రారంభించవచ్చు. కొన్నింటికి రూ. 1 లక్ష వరకూ అసరమవుతుండగా, మరికొన్నింటికి నగదు అవసరమే లేదు. కావాల్సిందల్లా ఐడియా, దాని అమలు, ప్రణాళిక బద్దంగా నడుపుకోవడం. అలాంటి 11 ఐడియాల గురించి ఇక్కడ చూద్దాం.

టిఫిన్ సెంటర్
మీకు వంట చేయడంలో ప్రావీణ్యం ఉందని భావిస్తే టిఫిన్ సెంటర్‌ను నడుపుకోవచ్చు. ఇంటి వంటలాగే ఉండే ఆహారాలను తినే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ వ్యాపారానికి కాస్త పెట్టుబడి కావాలి. ఇంటి నుంచే నడుపుకునే వీలుంటుంది.

పెట్ కేర్
మీకు పెంపుడు జంతువులంటే ఇష్టం ఉంటే, పెంపుడు జంతువుల సంరక్షణ వ్యాపారం (పెట్ కేర్) చేపట్టవచ్చు. మీకు స్వంత స్థలం ఉన్నట్లయితే దీనిని సున్నా పెట్టుబడితో ప్రారంభించవచ్చు.

టాక్సీ సర్వీస్
పెరుగుతున్న నగరీకరణ, ప్రయాణాల మూలంగా ఈ వ్యాపారం ఊపందుకుంటోంది. మామూలు వ్యక్తులు సైతం ఈ వ్యాపారాన్ని చూసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మీకు సొంత వాహనం ఉంటే ఈ వ్యాపారాన్ని పెట్టుబడి లేకుండానే మొదలుపెట్టవచ్చు.

ట్యూషన్స్
పిల్లలకు బాగా బోధించే తెలివి ఉండి, వారిని హ్యాండిల్ చేయగలిగే నైపుణ్యం ఉంటే ఇది మంచి ఐడియా. అయితే దానిలో ఉండే లోతుపాతుల గురించి ఆ రంగంలో ఉండే వారి సలహాలు తీసుకోవడం మంచిది.

వంట నేర్పడం
వంట చేయడంలో నైపుణ్యం ఉండి, బాగా ఎదుటివారికి వివరించగలం అనుకునేవారు ఈ విధంగాను డబ్బు సంపాదించుకోవచ్చు. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. హోమ్‌మేకర్లు మీ నుంచి నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు.

డ్యాన్స్, ఏరోబిక్, యోగా పాఠాలు
మీకు ఏదైనా కళలో నైపుణ్యం ఉంటే ఈ విధంగాను చేయవచ్చు. డ్యాన్స్ పాఠాలు నేర్పించడం మంచి డిమాండ్ కలిగిన రంగం. అలాగే ఏరోబిక్, యోగా వంటి అంశాలను సైతం నేర్చుకునేందుకు చాలా మంది ఎదురుచూస్తుంటారు.

కొరియర్ కంపెనీ
ఎన్నో కొరియర్ కంపెనీలకు తమ వ్యవహారాలను చిన్న చిన్న ఏరియాల్లో ఫ్రాంచైజీలుగా నిర్వహించేందుకు కొత్త వ్యక్తుల అవసరం ఉంటుంది. ప్రస్తుతం డీటీడీసీ(డోర్ టు డోర్ కొరియర్) కంపెనీకి ఎన్నో ఫ్రాంచైజీలు ఉండటాన్ని చూస్తుంటాం. ఏదైనా చిన్న స్థలం కోసం అద్దె కట్టగలిగి, మనుషులను నిర్వహించుకోగలం అనుకునే వారికి ఈ వ్యాపారం అనువైనది.

ఫ్రీలాన్స్
ఫ్రీలాన్స్ రైటింగ్, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి అవకాశాల కోసం సైతం ప్రయత్నించవచ్చు. అన్ని రంగాల నిపుణులకు ఈ రంగాల్లో నూతన అవకాశాలు బాగా ఉపయుక్తంగా ఉంటాయి.

ఫైనాన్సియల్ కన్సల్టెంట్
ఆర్థిక వ్యవహారాల్లో మీరు నైపుణ్యం కలిగి ఉన్నట్లయితే పోర్ట్‌ఫోలియో కన్సల్టెంట్‌గా ప్రయత్నించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే దీన్ని ప్రారంభించవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications