తెలుగు రాష్ట్రాలలో దుమ్ముదులుపుతున్న ఎలక్షన్ ఫండ్స్ ఎంతో తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సమయం దగ్గరకి వస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీలు మరియు ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థులు వారి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇక పార్టీల మీద అభిమానం ఉన్నవారు తమవంతు విరాళాలు ఇచ్చారు. ఇక వివిధ రాజకీయ పార్టీల విరాళాలు ఇలా ఉన్నాయి.

తెలుగు దేశం పార్టీ:
వాస్తవానికి ప్రాంతీయ పార్టీలో ధనిక పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి 2017-18లో కేవలం కోటి 73 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. ఈ ఏడాది జులై 11వ తేదీన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇ పెద్దిరెడ్డి ఎన్నికల సంఘానికి రూ. 20,000లకు మించిన పార్టీ విరాళాల జాబితా అందించారు. మొత్తం 83 మంది/సంస్థల నుంచి రూ. 1,73,71,922 అందినట్లు ఆయన తెలిపారు. రూ. 25 లక్షలు ఇచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి అత్యధికంగా విరాళం ఇచ్చిన వ్యక్తిగా నిలిచారు. గోనుగుంట్ల వెంకట శివ సీతారామ ఆంజేయులు రూ. 11 లక్షలు, గల్లా జయదేవ, బోళ్ల బుల్లిరామయ్య, దేవినేని అవినాశ్‌ రూ.10 లక్షలు చొప్పున విరాళం ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాలలో దుమ్ముదులుపుతున్న ఎలక్షన్ ఫండ్స్ ఎంతో తెలుసా?

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ:
2014 ఎన్నికల తరవాత నిస్తబ్దంగా ఉన్న వైకాపా కూడా విరాళాలపై దృష్టి పెట్టింది. తాజా వివరాలు ఇంకా వెల్లడి కాకున్నా గత ఆర్థిక సంవ్సరానికి పార్టీ విరాళాలు అనూహ్యంగా పెరిగాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 20,000లకు మించి అందిన విరాళాల వివరాలను ఆ పార్టీ కోశాధికారి పి.కృష్ణ మోహన్‌ రెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన ఎన్నికల సంఘానికి తెలిపారు. 2017-18లో 49 మంది నుంచి రూ. 8,35,41,116లు అందినట్లు పార్టీ తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన లెకాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అత్యధికంగా కోటిన్నర రూపాయలు పార్టీకి విరాళంగా అందించింది. కాకినాడకు చెందిన బి.అనుబాబు రూ. 45 లక్షలు ఇచ్చారు. జగన్‌ కుటుంబానికి చెందిన సండూర్‌ పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.25 లక్షలు, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.33 లక్షలు విరాళంగా ఇచ్చాయి.

టిఆర్ఎస్:
ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్‌ఎస్‌)కి విరాళాల వర్షం కురిసింది. కేవలం నాలుగు నెలల్లో రికార్డు స్థాయిలో రూ.19,41,00,000 వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జులై 23వ తేదీ వరకు అంటే ఎన్నికల సంఘానికి విరాళాల వివరాలు ఇచ్చే సమయానికి పార్టీకి అందిన విరాళాల మొత్తం రూ.19.41 కోట్లు. ఈ విరాళాలు 51 మంది/సంస్థలు ఇచ్చినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల సంఘానికి తెలిపారు. పార్టీ విరాళాల్లో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ రూ.2 కోట్లు ఇచ్చింది. టీడీపీ ఎంపీ చామకూర మల్లా రెడ్డి వ్యక్తిగతంగా కోటి రూపాయలు ఇచ్చారు. అలాగే జి.సరోజా వివేకానంద్‌ కూడా కోటి రూపాయలు ఇచ్చారు. ఇక హైదరాబాద్‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ రెండు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. కోటి రూపాయలు ఇచ్చినవారిలో హోటల్‌ పార్క్‌ కాంటినెంటల్‌, ఏరో స్పేస్‌ టెక్నాలజీస్‌ ఉన్నాయి మూలం ఏన్ టీవీ.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+