నాని అంటే అందరికి గుర్తొచ్చేది న్యాచురల్ స్టార్, నాని నటించే చిత్రాలు సామాన్య ప్రజలకు అత్యంత చేరువగా ఉంటాయి.
నాని అంటే అందరికి గుర్తొచ్చేది న్యాచురల్ స్టార్, నాని నటించే చిత్రాలు సామాన్య ప్రజలకు అత్యంత చేరువగా ఉంటాయి.అందుకే అతి తక్కువ కాలంలోనే స్టార్ డం గా మంచి పేరు సంపాదించాడు.కుర్రకారులో నానికి మంచి క్రేజ్ ఉంది అలాగే నాని సినిమా అంటేనే కుటుంబసమేతంగా వెళ్లి చూడాలని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు అంటే ఇతడు ఎంచుకునే చిత్రాలు మరియు కథలు ప్రజలకు అంత గా నచ్చుతాయి అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు.

తిరుగులేని ఫాన్స్ ఫాలోయింగ్:
జూనియర్ NTR తరువాత వరుస హిట్లు సాధిస్తున్న హీరో న్యాచురల్ స్టార్ నాని మాత్రమే.తనకు బాగా సూటయ్యే కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నానికి ఎపుడు తిరుగులేని ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది.తెలుగు సినీ పరిశ్రమలో మినిమం గ్యారెంటీ ఉన్న హీరో ఎవరు అంటే నాని అని టక్కున చెప్పేస్తారు.

రేడియో జాకీ:
రేడియో జాకీ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన నాని తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగాడు.ఐతే,అదృష్టం కలిసి రావడంతో పాటు కష్టపడే స్వభావం ఉన్న నాని కొద్దీ కాలంలోనే సినీ ఇండస్ట్రీ లో బాగా నిలదొక్కుకున్నాడు.మొదటి సినిమా అష్ట చెమ్మ తో నాని తలరాత మారిపోయింది.

పలు దర్శకుల వద్ద:
హీరో గా పరిచయం కాక ముందు నాని శ్రీనువైట్ల మరియు బాపు వంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్నాడు.భీమిలి కబడ్డీ జట్టు ,ఆలా మొదలైంది,ఎటోవెళ్లిపోయింది మనసు వంటి చిత్రాలతో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

స్టార్ డం రేంజ్:
ఇంకా,ఎవడే సుబ్రహ్మణ్యం,బలే బలే మగాడివోయ్,కృష్ణగాడి వీర ప్రేమ గాధ,నేను లోకల్,నిన్ను కోరి,మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి చిత్రాలతో నాని స్టార్ డం హై రేంజ్ కు చేరింది.

రెమ్యూనరేషన్:
నాని రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు అక్షరాలా రూ.5 కోట్లు అది కూడా ఇంతకు ముందు నటించిన సినిమాలకు కానీ ప్రస్తుతం నాని రెమ్యూనరేషన్ రూ.10 కోట్లు దాటిపోయిందని చిత్ర పరిశ్రమ మాట.కృష్ణార్జున యుద్ధం సినిమాకు నాని రూ.10 కోట్లు తీసుకున్నాడని సమాచారం.

పక్కా కుటుంబ వ్యక్తి:
నాని తన కాళీ సమయాల్లో కుటుంబంతో గడపడానికి చాల ఇష్టపడతాడు,సినిమాలు లేని సమయాల్లో బయట ఎక్కడ కనపడడు ఒకవేళ కనిపించిన పక్కన ఫ్యామిలీ ఉంటుందని అంటున్నారు.మధ్య తరగతి కుటుంబానికి చెందిన నాని కి డబ్బు విలువ బాగా తెలుసు.

పొదుపు డబ్బు తో:
నాని మొదటి నుండి తాను పొదుపు చేసుకున్న డబ్బు తో గచ్చిబౌలి లో అద్భుతమైన విల్లా కొనుగోలు చేసాడు.ఈ విల్లా ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ స్టైల్ లో నిర్మించడంతో దీన్ని చూసిన ప్రతి ఒక్కరు ఇది ఫారెన్ స్టైల్ ఇల్లు అని అంటూ ఉంటారు.

కొత్త ఇంటి ఖరీదు:
నాని ఈ కొత్త ఇంటిని సుమారు రూ.5 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.తన కొత్త ఇంటిని సినీ ప్రశ్రమలో తన మిత్రులయిన చాల మందికి చూపిస్తే వాళ్ళందరూ అవాక్కయారంట.వెస్ట్రన్ దేశాల్లో ఉండే బీట్ హౌస్ ఎలా ఉంటుందో నాని ఇల్లు కూడా అలానే ఉంటుంది అంటున్నారు.

ఇంటి ప్రత్యేకత:
బెల్జియం గ్లాస్ అవుట్ ఫిట్స్ తో ఉండే బాల్కనీలు పూర్తిగా చెక్క తో చేసి ఎంతో అందంగా కనిపించే పోర్టిగో అలాగే ఖరీదయిన కారిడార్ ఇలా దేనికదే ప్రత్యేకత ఉంది.హాల్ లో కి వెళ్తే ఫ్లోరింగ్ చూసిన వారికి దిమ్మ తిరుగుతుంది అవి పూర్తి చైనీస్ మార్బల్ స్టోన్స్ కావడంతో వాటిపై నడుస్తుంటే హిమాలయాల్లో నడుస్తున్న ఫీలింగ్ ఉంటుందట.

వంట గది ప్రత్యేకత:
ఇక వంట గది విషయానికొస్తే 'స్టేట్ అఫ్ ది ఆర్ట్' టెక్నాలజీ ఉపయోగించారు.360 డిగ్రీలు కనిపించేలా ఇంటి పైభాగం లో పడక గది ఏర్పాటు చేశారు ఇంకా ఇంట్లోనే కసరత్తులు చేసుకోడానికి జిమ్ అలాగే స్పా మరియు మినీ థియేటర్ చూస్తే ఇంద్ర భవనం తలపించాల్సిందే.అందుకే నాని కొత్త ఇంటి గురించి సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయిన్ది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications