మీ వద్ద ఈ కార్డు ఉందా?ఐతే మీకు రైలు ప్రయాణాలు పూర్తిగా ఉచితం?
మీకు ఉచిత రైల్వే టిక్కెట్లను మరియు ఇతర ప్రయోజనాలను అందించే SBI రైల్వే కార్డ్, ఇది మీకు క్రెడిట్ కార్డు లాగ పనిచేస్తుంది.
IRCTC లేదా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఇది భారత రైల్వే క్యాటరింగ్, టూరిజం మరియు ఆన్ లైన్ టికెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది, మీకు ఉచిత రైల్వే టిక్కెట్లను మరియు ఇతర ప్రయోజనాలను అందించే SBI రైల్వే కార్డ్, ఇది మీకు క్రెడిట్ కార్డు లాగ పనిచేస్తుంది. ఐఆర్సిటిసి ఎస్బిఐ ప్లాటినం కార్డ్ పై 350 రివార్డ్ పాయింట్లు, 1.8 శాతం లావాదేవీల వ్యయం, ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ మరియు 10 శాతం విలువ రైల్వే బుకింగ్లపై తిరిగి ఇస్తున్నట్లు ఐఆర్సిటిసి తన వెబ్సైట్లో పేర్కొంది.

రివార్డ్ పాయింట్లు:
ఖాతాదారులకు AC1, AC2, AC CC బుకింగ్ లపై బేస్ రిటైల్లో 10 శాతం క్యాష్ బ్యాక్ తిరిగి పొందవచ్చు.

లావాదేవీ ఛార్జీలు తగ్గింపు:
లావాదేవీల పై (జిఎస్టి మరియు ఇతర అన్ని ప్రయోజనాలు) 1.8 శాతం వ్యయం పొందుతారని పేర్కొంది. IRCTC ఎస్బిఐ ప్లాటినమ్ కార్డుతో IRCTC.co.in లో వారి రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు వినియోగదారులకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

ఉచిత రైలు టికెట్లను సంపాదించండి:
మీ IRCTC ఎస్బిఐ ప్లాటినమ్ కార్డులో షాపింగ్, రెస్టవురెంట్స్ భోజనం,ప్రయాణాలు మరియు ప్రతి రూ.125 రూపాయలు ఇంధనేతర కొనుగోళ్లపై రివార్డ్ పాయింట్లు పొందవచ్చు అలాగే irctc.co.in లో రైల్వే టికెట్ కొనుగోళ్లు సహా. వినియోగదారులు తమ రివార్డ్ పాయింట్లన్నింటిని irctc.co.in లో రైల్వే టికెట్ కొనుగోళ్లకు వ్యతిరేకంగా పొందవచ్చు.

ఇంధనం పై 0% లావాదేవీల రుసుము:
వినియోగదారుడు ఇంధన మరియు ఇతర కందెనలు కొనడానికి కార్డును ఉపయోగించవచ్చు.ప్రతి సారిరూ. 400 మరియు రూ.2000 రూపాయలు ఇండియన్ ఆయిల్ & ఇండో బ్రైట్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ (IBP) పెట్రోల్ పంపుల్లో లావాదేవీల పై ఆదా చేయండి.

పర్సనల్ భీమా రక్షణ:
వినియోగదారులకు ఒక వ్యక్తిగత ప్రమాద బీమాను అందించనుంది.ఎవరైనా రైలు ప్రమాదానికి గురై జీవితాన్ని కోల్పోయినప్పుడు 10 లక్షల రూపాయలు చెల్లుబాటు అయ్యే టికెట్ లో ప్రయాణించిన వ్యక్తికి వర్తిస్తుందని, ఐఆర్సిటిసి తెలిపింది.
IRCTC SBI ప్లాటినం కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవటానికి, వినియోగదారులు 5676791 కు "RAIL" అని టైపు చేసి SMS పంపవచ్చు.


Click it and Unblock the Notifications