దేశీయ మరియు అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై ఎయిర్లైన్స్ డిస్కౌంట్లను ప్రకటించింది. 13 రోజుల ప్రత్యేక విక్రయాలను గోఎయిర్ ప్రకటించింది.
దేశీయ మరియు అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై ఎయిర్లైన్స్ డిస్కౌంట్లను ప్రకటించింది. 13 రోజుల ప్రత్యేక విక్రయాలను గోఎయిర్ ప్రకటించింది.13 లక్షల సీట్లకు ప్రారంభ ధర రూ. 1,313 రూపాయలు ఉన్నటు ఎయిర్లైన్ తెలిపింది. దీపావళి సేల్స్ లో భాగంగా, దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై 30 శాతం డిస్కౌంట్ను జెట్ ఎయిర్వేస్ జారీ చేసింది. దేశీయ పౌర విమానయాన మార్కెట్లో అధిక పోటీలో ఎయిర్లైన్స్ నుండి వచ్చిన ఆఫర్లు, ప్రస్తుత పండుగ సీజన్లో సాధారణంగా డిమాండ్లో చాల పెరుగుదల కనపరుస్తాయి.

ఎయిర్లైన్స్ ప్రకటించిన దేశీయ మరియు అంతర్జాతీయ విమాన టిక్కెట్ల ఆఫర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
గోఏర్ ఆఫర్
13 లక్షల సీట్ల ప్రత్యేక విక్రయాలను గోఎయిర్ ప్రకటించింది,వీటికి ప్రారంభ ధర రూ. 1,313 రూపాయలు అని తెలిపింది.గోఎయిర్ ఆఫర్ల బుకింగ్ సమయం నవంబర్ 18, 2018 న ముగుస్తుంది. గోఏర్ విమాన టికెట్లు ఈ పథకం కింద నవంబరు 4, 2019 వరకు ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి తన అధికార వెబ్ సైట్ లో తెలిపింది.
జెట్ ఎయిర్వేస్ ఆఫర్
దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై జెట్ ఎయిర్వేస్ 30 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. ప్రయాణీకులకు వన్-వే ఫ్లై ముంబై-కోచికి రూ. 1,998 మరియు ముంబయి-మస్కట్ కు రూ.6,723 రూపాయల ధర ఉందని ఎయిర్లైన్స్ తెలిపింది.ప్రీమియర్ మరియు ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్లలో జెట్ ఎయిర్వేస్ ఆఫర్ వర్తించబడుతుంది.

కాగా ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో (జనవరి నుంచి ఆగస్టు 2018 వరకు) దేశీయ విమానయాన సంస్థలు 913.95 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 754.11 లక్షల మంది ప్రయాణికులను నమోదుచేసింది ఎయిర్పోర్టు డీజీసీఏ లేదా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది . ప్రయాణీకుల రద్దీలో సంవత్సరం ప్రాతిపదికన 21.20 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications