దీపావళి అంటే అందరి జీవితాల్లోకి సకల శుభాలు, వెలుగును తీసుకొచ్చే పండుగ అని అందరు నమ్ముతుంటారు అదికాక మన భారతీయులకి అందరికి ఈ దీపావళికి పండుగ ఒక పెద్ద పండుగ అలాంటిది ఒక దీపావళి రోజు మాత్రమే ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరగడం ఆశ్చర్యం అని అందరు అంటున్నారు.
ఇంతకీ ఈ వ్యాపారం ఎక్కడ జరిగిందో ఎంత జరిగిందో తెలుసుకుందాం.
దీపావళి పండుగను పురస్కరించుకుని తమిళనాడులో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. కేవలం నాలుగు రోజుల్లో ఏకంగా 602 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని మద్యం బాబులు తాగేశారు. గత యేడాది విక్రయాలతో పోల్చుకుంటే ఇది 34 శాతం అధికం కావడం గమనార్హం. అలాగే, చెన్నై మహానగరంలో నాలుగు రోజుల్లో ఏకంగా రూ.175 కోట్లకు మద్యం విక్రయాలు జరిగాయి. గత యేడాదితో పోల్చితే ఇది 20 శాతం అధికం.

సాధారణంగా పండుగ సీజన్‌లలో మద్యం విక్రయాలు జోరుగానే సాగుతుంటాయి. ఆ విధంగా ఈ యేడాది మద్యం విక్రయాలకు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అన్ని మద్యం దుకాణాల్లో భారీగా మద్యం నిల్వలు ఉంచారు.
ఈ నేపథ్యంలో దీపావళి పండుగ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.602 కోట్లకు విక్రయాలు జరిగాయి. ఒక్క చెన్నై నగరంలో జరిగిన విక్రయాలను పరిశీలిస్తే, గత శనివారం రోజున రూ.124 కోట్లకు విక్రయాలు జరిగాయి. అలాగే, గత ఆదివారం రూ.150 కోట్లు, సోమవారం రూ.148 కోట్లు, దీపావళి పండుగ రోజున రూ.180 కోట్లకు చొప్పున మద్యం విక్రయాలు జరిగాయి.
నిజానికి ఈ దీపావళికి టపాకాయల విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే, ఇతర వస్తు సామాగ్రి విక్రయాలు కూడా గణనీయంగా తగ్గాయి. కానీ, మద్యం విక్రయాలు మాత్రం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 35 శాతం మేరకు పెరగడం గమనార్హం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications