For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్ల రద్దుతో అందరికి మంచి జరిగింది అంటున్న అరుణ్ జెట్లీ

By girish
|

నవంబర్ 8 సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ తేదీని భారతీయులు మరిచిపోలేని తేదీ. ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు గుండెలు పగిలే వార్త చెప్పారు. 'పెద్ద' నోట్లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

దేశంలో

దేశంలో

ఆ సమయానికి దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం నగదులో రద్దు చేసిన నోట్ల వాటా 86 శాతం. నల్ల ధనం వెలికితీతతోపాటు నగదు రహిత లావాదేవీల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇలా రద్దు చేసి రెండేళ్లయింది.కానీ ప్రధాని మోడీ చెప్పినట్టు నగదు లావాదేవీలు తగ్గలేదు.

 క్యాష్‌ విత్‌డ్రా

క్యాష్‌ విత్‌డ్రా

ఆర్‌బీఐ లెక్కల ప్రకారం చూస్తే నవంబర్‌ 4, 2016కు దేశంలో చెలామణీలో ఉన్న నగదు రూ.17.9 లక్షల కోట్లు. అక్టోబర్‌ 26, 2018 నాటికి ఆ మొత్తం రూ.19.6 లక్షల కోట్లకు పెరిగింది. ఏటీఎంల నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసే మొత్తం కూడా పెరిగింది. అక్టోబర్‌ 2016 నాటికి సగటున నెలకు విత్‌ డ్రా చేసే మొత్తం రూ.2.54 లక్షల కోట్లుండగా.. ఆగస్టు 2018 నాటికి ఆ మొత్తం రూ.2.75 లక్షల కోట్లకు పెరిగింది. 2016 డిసెంబర్లో విత్‌డ్రాల మొత్తం రూ.1.06 కోట్లకు పడిపోయింది. ఇక.. మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు కూడా పెరిగాయి. అక్టోబర్‌ 2016లో రూ.1.13 లక్షల కోట్లున్న మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు.. ఆగస్టు 2018కి రూ.2.06 కోట్లకు చేరింది.

సమర్థించుకున్నారు

సమర్థించుకున్నారు

ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు నేటికీ తూర్పారబడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రధానమంత్రి దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రంగంలోకి దిగి తమ ప్రభుత్వ నిర్ణయాన్ని బలంగా సమర్థించుకున్నారు

ఫేస్ బుక్ పోస్టులో

ప్రధాని నరేంద్ర మోడీ 2016 నవంబర్ 8 అర్థరాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడానికి గల కారణాలను అరుణ్ జైట్లీ తన ఫేస్ బుక్ పోస్టులో వివరించారు. డ‌బ్బును స్వాధీనం చేసుకోవాల‌న్న ల‌క్ష్యంతో నోట్ల ర‌ద్దు చేప‌ట్టలేద‌న్నారు. అక్రమంగా దాచుకున్న సొమ్మును ఆర్థిక వ్యవ‌స్థలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో డిమానిటైజేష‌న్ చేప‌ట్టిన‌ట్లు జైట్లీ తెలిపారు

న‌ల్లధ‌నాన్ని

న‌ల్లధ‌నాన్ని

ఆర్థిక వ్యవ‌స్థను పట్టాలపైకి ఎక్కించేందుకు తీసుకున్న నిర్ణయాల్లో పెద్దనోట్ల రద్దు ఒక‌టని జైట్లీ అన్నారు. దేశం బ‌య‌ట ఉన్న న‌ల్లధ‌నాన్ని ప్రభుత్వం టార్గెట్ చేసింద‌ని, జ‌రిమానా ప‌న్ను క‌ట్టి, ఆ సొమ్మును తీసుకొచ్చే విధంగా చ‌ర్యలు తీసుకున్నట్టు తెలిపారు. న‌ల్లధ‌నాన్ని బయటికి తీయని వారిపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

మ్యూచువ‌ల్ ఫండ్స్

మ్యూచువ‌ల్ ఫండ్స్

విదేశాల్లో ఖాతాలు ఉన్నవారిని ప్రశ్నిస్తున్నామ‌న్నారు. అక్రమంగా నిలవ చేసిన డ‌బ్బును. నోట్ల ర‌ద్దుతో బ్యాంకుల‌కు వ‌చ్చే విధంగా చేశామ‌ని చెప్పారు. సుమారు 17.42 ల‌క్ష అక్రమ అకౌంట్లు గుర్తించినట్టు తెలిపారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి, ప‌న్ను ఎగ‌వేసిన వారిని శిక్షించామ‌ని వివరించారు. డిపాజిట్లు పెర‌గ‌డం వ‌ల్ల బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలు ఇస్తున్నాయ‌న్నారు. అక్రమ డ‌బ్బు చాలావ‌ర‌కు మ్యూచువ‌ల్ ఫండ్స్ రూపంలో పెట్టుబ‌డిగా వచ్చిందన్నారు. గ‌త ఆర్థిక సంవ‌త్సరంలో ప‌ర్సన‌ల్ ఇన్‌కం ట్యాక్స్ రాబ‌డి పెరిగింద‌ని గుర్తు చేశారు.

Read more about: modi
English summary

నోట్ల రద్దుతో అందరికి మంచి జరిగింది అంటున్న అరుణ్ జెట్లీ | Two Years Demonetisation

Demonetisation is a key step in a chain of important decisions taken by govt to formalise the economy
Story first published: Thursday, November 8, 2018, 15:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X