మన భారత దేశంలో పెద్ద పండుగలలో ఒకటి దీపావళి ప్రతి సామాన్యుడు దీపావళికి ఏదో ఒకటి కొంటారు అది టీవీ ఐన ఫోన్ ఐన ఇలా చాలా ఉన్నాయి.కానీ దీపావళికి బంగారం మాత్రం ప్రత్యేకం దీపావళికి బంగారం కొంటే మంచిది అని ప్రజల నమ్మకం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇక మీరు కూడా ఈ దీపావళికి బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. బంగారం కొనేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

దీపావళికి
దీపావళికి భారతదేశంలో బంగారం అమ్మకాలు ఎక్కువ. ఇప్పటికే చాలా కంపెనీలు బంగారంపై ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ కూడా అదే బాటలో నడిచింది.

గోల్డ్ కాయిన్స్
గోల్డ్ కాయిన్స్ కొనేవారికి ఎస్‌బీఐ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ద్వారా గోల్డ్ కాయిన్ కొంటే డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
ట్విట్టర్‌లో
ఈ ఆఫర్‌ని ట్విట్టర్‌లో ప్రకటించింది ఎస్‌బీఐ. గోల్డ్ కాయిన్ కొన్న వారికి 2 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. టాటా క్లిక్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేసినవారికి రూ.600 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది.

పింఛనుదారుల కోసం:
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పింఛనుదారుల కోసం దీపావళి కానుక ప్రకటించింది. వారి కోసం ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. నవంబరు 30 వరకు పింఛను లోన్లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబోమని ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, రక్షణ శాఖకు చెందిన పింఛనుదారుల కోసం ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు తెలిపింది.

రుణాలు
ఎస్‌బీఐ శాఖల నుంచి నెలనెలా పింఛను తీసుకునే వారికి ఈ పింఛను రుణాలు ఇస్తున్నారు. 76 ఏళ్లలోపు వయసు గల వారికి ఇవి ఇస్తున్నారు. కనిష్టంగా రూ. 25 వేల నుంచి గరిష్టంగా రూ. 14 లక్షల వరకు ఎస్‌బీఐ ఈ రుణాలను మంజూరు చేస్తోంది. ఈ పింఛనుదారులందరికీ నవంబరు 30 లోపు రుణాలు తీసుకుంటే దానిపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయరన్నమాట.

అధికారిక వెబ్‌సైట్లో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రక్షణ శాఖ పింఛనదారులు 72 ఏళ్ల లోపు వారైతే గరిష్టంగా రూ. 14 లక్షల పింఛను రుణం తీసుకోవచ్చు. 72 నుంచి 74 ఏళ్ల లోపు వారు రూ. 12 లక్షల వరకు, 74 నుంచి 76 ఏళ్లలోపు వారు రూ. 7.50 లక్షల రుణం తీసుకోవచ్చు. ఈ రుణాలకు సంబంధించి వివరాలు, నిబంధనలను ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications