For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రోల్ ధరలు ఈవిదంగా ఉన్నాయి.

పెట్రోల్, డీజెల్ ధరలు బుధవారం నాడు (దీపావళి) ఐదు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న ధరలకు బ్రేకులు పడ్డాయి.

By bharath
|

పెట్రోల్, డీజెల్ ధరలు బుధవారం నాడు (దీపావళి) ఐదు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న ధరలకు బ్రేకులు పడ్డాయి. మంగళవారం ఢిల్లీలో గత ఆరు వారాలలో పెట్రోలు ధర తక్కువగా నమోదైంది.జాతీయ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ బుధవారం నాడు రూ.78.42 రూపాయల వద్ద విక్రయించగా, డీజెల్ రూ.73.07 రూపాయలకు రిటైలింగ్ అయింది.

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రోల్ ధరలు ఈవిదంగా ఉన్నాయి.

ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.83.92 రూపాయలు అలాగే డీజిల్ రూ.76.57 రూపాయల చొప్పున ధర ఉంది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ఇంధన ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి, డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి విలువ మెరుగుపడింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్, అంతర్జాతీయ ముడి ధరల బెంచ్మార్క్ బుధవారం బ్యారెల్ స్థాయి 72 డాలర్లకు పడిపోయింది. గత రెండు వారాల్లో ముడిచమురు ధరలు 15 శాతం పతనమయ్యాయి.

ఇదిలా ఉండగా, గత కొన్ని వారాలుగా అమెరికా డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ కూడా 2 శాతం వరకు పెరుగుతోంది.

చెన్నై, కోల్కతా వంటి ఇతర మెట్రో నగరాల్లో లీటరు పెట్రోలు రూ.81.46 రూపాయలు, రూ.80.33 రూపాయలు ధరలు ఉన్నాయి మరియు డీజిల్ రూ.77.24 రూపాయలు,రూ.74.93 రూపాయలకు విక్రయిస్తోంది.

నోయిడాలో బుధవారం పెట్రోలు ధర రూ.76.54 రూపాయలు, డీజిల్ రూ .71.24 వద్ద నమోదయినది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాట్ లలో తాజా తగ్గుదల తర్వాత ఢిల్లీతో పోల్చినప్పుడు పెట్రోల్, డీజెల్ ఇప్పుడు నోయిడాలో తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. గత నెల,కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మరియు డీడీజిల్ పై పన్నులు తగ్గించాయి.

Read more about: petrol diesel
English summary

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రోల్ ధరలు ఈవిదంగా ఉన్నాయి. | Petrol, Diesel Prices Remain Unchanged On Diwali.

Petrol, diesel prices were unchanged on Wednesday (Dewali) after a fifth straight day of cut. It is worth mentioning here that petrol price has touched its lowest level in the last six weeks in Delhi on Tuesday.
Story first published: Wednesday, November 7, 2018, 16:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X