నేడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయులు అందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ట్వీట్
అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, అష్ట ఐశ్వర్యాలతోపాటు ఆరోగ్యంగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చెబుతూ ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. ఈ దీపావళి అందరి జీవితాల్లోకి సకల శుభాలు, వెలుగును తీసుకురావాలని కోరుకుంటున్నట్టు మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మోడీ దీవాలి కనుక ఇదే:
చిన్న మరియు మధ్య పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి బహుమతి ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చిన్న మరియు మధ్య పరిశ్రమల అభివృద్ధి కోసం MSME లోన్ సౌకర్యాన్ని ప్రారంభించారు

59 నిమిషాల్లో
దీని ప్రకారం కేవలం 59 నిమిషాల్లో రూ.కోటి వరకు రుణం మంజూరీ పొందవచ్చు. ఇది కాకుండా చిన్నతరహా వ్యాపారాలకు తీసుకోనే రుణాలపై 2 శాతంమినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. లఘు పరిశ్రమల రంగానికి 12 కీలక నిర్ణయాలను వెల్లడించారు.

పరిశ్రమలకి
చిన్న మరియు మధ్య పరిశ్రమలకి ప్రభుత్వ సపోర్ట్ అండ్ ఔట్ రీచ్ ఇనిషియేటివ్ లాంచ్ ఈవెంట్ లో 59 నిమిషాల లోన్ పోర్టల్ లాంచింగ్ ని ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ MSME లేదా లఘు పరిశ్రమల ద్వారా కోట్లాది ప్రజలు ఉపాధి పొందుతున్నారని మోడీ అన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది MSMEలోనే పని చేస్తున్నారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, లఘు, మధ్య పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.

రుణంపై వడ్డీ
ఈ కార్యక్రమంలో 3 శాతం ఉన్న రుణంపై వడ్డీ సహాయాన్ని 5 శాతానికి పెంచుతున్నట్టు మోడీ ప్రకటించారు. జీఎస్టీ కింద వచ్చే MSME పరిశ్రమలు తీసుకొనే రూ.కోటి వరకు కొత్త రుణాలు లేదా ఇంక్రిమెంటల్ లోన్లపై వడ్డీలో 2% తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రధాన సమస్య రుణాలు పొందడమేనని.. అందువల్ల లోన్ పోర్టల్ ప్రారంభించినట్టు చెప్పారు.నాలుగేళ్ల క్రితం తాము అధికారంలోకి రాకముందు భారత్ ర్యాంకింగ్ 142 ఉండేదని ప్రస్తుతం 77వ ర్యాంకుకు చేరినట్టు తెలిపారు. త్వరలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ టాప్-50కి చేరనుందన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications