దీపావళి సందర్భంగా, పలు టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు ప్రవేశపెట్టారు.వీటిలో అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా మరియు ఉచిత SMS
దీపావళి సందర్భంగా, పలు టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు ప్రవేశపెట్టారు.వీటిలో అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా మరియు ఉచిత SMS ల ప్రయోజనాలను కలిపి ఉత్సవ సీజన్లో భాగంగా ఇది అందుబాటులో ఉంచింది,మీకు దగ్గరలో ఉన్న అన్ని రీఛార్జి దుకాణాల్లో ప్రీపెయిడ్ చందాదారులు పొందవచ్చు.

జియో:
గత నెలలో రిలయన్స్ జియో రూ. 1,699 ధరతో జియో దీపావళి ఆఫర్ను ప్రారంభించింది. ఇది 365 రోజుల కాలపరిమితిని కలిగి ఉంది. జీయో ప్రీపెయిడ్ చందాదారులు నవంబర్ 30 వరకు ప్రయోజనాలను పొందవచ్చు, మరియు వినియోగదారులకు ఈ పథకం నుండి 100 శాతం క్యాష్ బ్యాక్ అందుతుంది, డిజిటల్ కూపన్లను వారి MyJio ఖాతాలలో జమ చేయబడతాయి.
జియో దీపావళి ఆఫర్ కింద,రోజుకు 1.5GB డేటాతో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు అలాగే రోజుకు 100 SMS లు ఉచితంగా అందిస్తుంది.మొత్తం సమయ వ్యవధిలో, జియో వినియోగదారులు 547.5GB డేటాను పొందుతారు, అలాగే జీయో లో భాగంగా నిర్మించబడిన యాప్ లకు ఉచితంగా ప్రాప్యత పొందుతారు.

బీఎస్ఎన్ఎల్:
బీఎస్ఎన్ఎల్ దీపావళి సందర్బంగా తన ప్రీపెయిడ్ చందాదారులకు అద్భుత ఆఫర్ పండుగ సీజన్ ప్రయోజనాన్ని అందించనుంది. ఈ ఆఫర్ కింద రూ. 1,699, రూ.2,099 రూపాయల ధరకే సంస్థ యొక్క వర్గాల్లో ఢిల్లీ, ముంబైతో సహా అందుబాటులో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ చందాదారులు అపరిమిత వాయిస్ కాల్స్ అలాగే ఉచిత వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (PRBT) మరియు దీపావళి మహాధమాకా ఆఫర్ తో 365 రోజులు 100 ఉచిత SMS పొందుతారు.
ఈ ఆఫర్లలో, రూ.1,699 దీపావళి మహదమకా ప్లాన్ రోజుకు 3 జిబి డేటాతో ప్రీపెయిడ్డ్ చందాదారులకు అందిస్తుంది.మొత్తం 1095GB 4G / 3G / 2G డేటా ప్రయోజనాలు అందిస్తుంది. అలాగే మరో ప్లాన్,రూ.2,099 ప్రణాళిక 1460GB డేటా ప్రయోజనాలు సంవత్సరం పొడవునా అందిస్తుంది, కానీ రోజువారీ పరిమితులు వర్తిస్తాయి.

ఎయిర్టెల్:
ఇటీవలే, ఎయిర్టెల్ దాని ప్రీపెయిడ్ ప్రణాళికలను పునరుద్ధరించింది, అపరిమిత వాయిస్ కాల్తో మరియు 100 రోజువారీ SMS ప్రయోజనాలతో కూడిన అత్యధిక డేటా ప్రయోజనాలను అందిస్తోంది. వీటిలో రూ. 219 రీఛార్జ్ రోజుకు 1.5GB డేటాతో 28 రోజుల పాటు లభిస్తుంది, అలాగే రీఛార్జ్ వ్యవధికి ఉచిత హలో ట్యూన్స్ చందా లభిస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్రణాళికలను కూడా అందిస్తుంది, వీటిలో ప్రతి ఒక్కటి రోజుకి 1.4GB డేటాతో వస్తుంది.
ఇందులో రూ .419 ప్లాన్ 75 రోజులు, రూ. 399 ప్యాక్, రూ .448 ప్యాక్, వరుసగా 70 రోజులు, 82 రోజులు పనిచేస్తాయి. వీటితో పాటు, ఎయిర్టెల్ ప్రీపెయిడ్ చందాదారులు రూ .597 ప్రణాళికను ఎంచుకోవచ్చు,ఇది అపరిమిత కాలింగ్, 10GB డేటా, 114 రోజుల పాటు 100 రోజువారీ SMS లను అందిస్తుంది.

వోడాఫోన్:
వోడాఫోన్ దాని పండుగ ఆఫర్ కింద రీఛార్జ్ ప్యాక్స్ ప్రయోజనాలను మార్చలేదు అలాగే పండుగ సీజన్ కోసం ఏ ప్రత్యేక ప్రణాళికను ప్రకటించలేదు.రూ.209 రూపాయల రీఛార్జి ప్లాన్ తో వోడాఫోన్ చందాదారులు అపరిమిత కాల్, 100 రోజువారీ ఎస్ఎంఎస్లు, అలాగే రోజుకు 1.5 జిబి డేటాను 28 రోజుల పాటు పొందవచ్చు. పునరుద్ధరించబడిన ఇతర ప్రణాళికలు రూ.479 రూపాయలు మరియు రూ .529 పథకాలపై,రోజుకు 1.5GB 4G / 3G డేటాను అందిస్తాయి,చందాదారులు ఈ పథకాలు 84 రోజులు మరియు 90 రోజులలో ప్రయోజనాలను పొందుతారు.
వోడాఫోన్ ఇటీవలే రు .597 పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో 10 జీబి డేటా, అపరిమిత కాల్ ప్రయోజనాలు, 100 రోజువారీ ఎస్ఎంఎస్లు లభిస్తాయి. మొత్తం వోడాఫోన్ ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనగా, అపరిమిత కాలింగ్ రోజువారీ పరిమితికి 250 నిముషాలు లేదా వారానికి 1000 నిముషాల పరిమితులను విధించడం గమనించాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications