మన భారత దేశంలో పెద్ద పండుగలలో ఒకటి దీపావళి ప్రతి సామాన్యుడు దీపావళికి ఏదో ఒకటి కొంటారు అది టీవీ ఐన ఫోన్ ఐన ఇలా చాలా ఉన్నాయి.కానీ దీపావళికి బంగారం మాత్రం ప్రత్యేకం దీపావళికి బంగారం కొంటే మంచిది అని ప్రజల నమ్మకం. ఇక మీరు కూడా ఈ దీపావళికి బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. బంగారం కొనేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

దీపావళికి
దీపావళికి భారతదేశంలో బంగారం అమ్మకాలు ఎక్కువ. ఇప్పటికే చాలా కంపెనీలు బంగారంపై ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ కూడా అదే బాటలో నడిచింది.

గోల్డ్ కాయిన్స్
గోల్డ్ కాయిన్స్ కొనేవారికి ఎస్‌బీఐ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ద్వారా గోల్డ్ కాయిన్ కొంటే డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
ట్విట్టర్‌లో
ఈ ఆఫర్‌ని ట్విట్టర్‌లో ప్రకటించింది ఎస్‌బీఐ. గోల్డ్ కాయిన్ కొన్న వారికి 2 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. టాటా క్లిక్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేసినవారికి రూ.600 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది.

ఎస్‌బీఐ
ఎస్‌బీఐ యోనో(యూ ఓన్లీ నీడ్ వన్) యాప్‌లో కూడా చాలా డిస్కౌంట్ ఆఫర్లున్నాయి. దీపావళి పండుగనాటికి ఎస్‌బీఐ మరిన్ని ఆఫర్లు ప్రకటిస్తుందని అంచనా.

SBI నుంచి కొన్ని హెచ్చరికలు :
ఇది డిజిటల్ యుగం. ఎలాంటి లావాదేవీలైనా స్మార్ట్‌ఫోన్‌పై జరిగిపోతుంటాయి. కాలు కదపకుండా కూర్చున్నచోటి నుంచే ట్రాన్సాక్షన్స్ చేయడం మంచి సదుపాయమే. కానీ ఎక్కడైతే సౌకర్యం ఉంటుందో అక్కడ ప్రమాదం కూడా పొంచే ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మీరు కాలు కదపకుండా ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తారో సైబర్ నేరగాళ్లు కూడా కూర్చున్న చోటి నుంచే మీ అకౌంట్ ఖాళీ చేస్తుంటారు. ఇలాంటి మోసాల పట్ల అవగాహన కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

ఫేక్ అకౌంట్లు
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు మెయింటైన్ చేసేవారితో పరిచయం పెంచుకుంటూ మీ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకండి అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. వెరిఫైడ్ అకౌంట్లు, అఫిషియల్ హ్యాండిల్స్‌నే ఫాలోకావాలని సూచిస్తోంది. ఎస్‌బీఐ ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ట్వీట్ చేసింది.

మోసం తప్పదు
మీ ఆర్థిక వివరాలన్నీ రహస్యంగా ఉంచాలని, సోషల్ మీడియాలో ఎట్టిపరిస్థితుల్లో షేర్ చేయకూడదని సూచిస్తోంది ఎస్‌బీఐ. సోషల్ మీడియా సైట్లల్లో ఫేక్ అకౌంట్స్‌ని అస్సలు పట్టించుకోకూడదని చెబుతోంది. వెరిఫైడ్ అకౌంట్లను 'బ్లూ రైట్ టిక్' చూసి గుర్తించొచ్చు. అవి తప్ప మిగతా ఏ అకౌంట్లను నమ్మినా, పరిచయం పెంచుకున్నా, స్నేహం చేసినా చివరకు మోసం తప్పదు.

జాగ్రత్తలు
- https తో మొదలుకాని వెబ్‌సైట్లల్లో మీ కార్డు వివరాలు ఇవ్వకూడదు. అలాంటి వెబ్‌సైట్స్ సురక్షితం కావు.
- మీరు బ్యాంకుకు ఇ-మెయిల్ రాయాలనుకుంటే... ముందు కాల్ సెంటర్‌కు కాల్ చేసి సరైన ఇ-మెయిల్ ఐడీ తీసుకోండి.
- మీ వ్యక్తిగత వివరాలేవీ పర్సనల్ ఇ-మెయిల్‌లో ఉంచకూడదు
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications