For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరింతగా తగ్గిన పెట్రోల్ ధరలు.నేడు ధరలు ఈవిదంగా ఉన్నాయి.

పెట్రోల్ ధర గత 18 రోజుల్లో లీటరు పై రూ. 4 రూపాయలు తగ్గింది మరియు డీజిల్ పై రూ.2.33 రూపాయల చొప్పున తగ్గింది.

By bharath
|

పెట్రోల్ ధర గత 18 రోజుల్లో లీటరు పై రూ. 4 రూపాయలు తగ్గింది మరియు డీజిల్ పై రూ.2.33 రూపాయల చొప్పున తగ్గింది. ఆగస్టు మధ్యలో ప్రారంభమైన దరల పెరుగుదల వరుసగా రెండు నెలలు కొనసాగింది.ప్రస్తుతం ఢిల్లీ లో పెట్రోలు పై ధర 21 పైసలు, డీజిల్ పై 17 పైసలు తగ్గాయని ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్ల ధరల నోటిఫికేషన్ వెల్లడించింది. ఢిల్లీలో పెట్రోలు ఇప్పుడు లీటరు రూ..78.78 మరియు డీజిల్ ధర రూ . 73.36 రూపాయలుగా నమోదయ్యాయి.

మరింతగా తగ్గిన పెట్రోల్ ధరలు.నేడు ధరలు ఈవిదంగా ఉన్నాయి.

ముంబయిలో పెట్రోల్ ధర రూ. 82.28 రూపాయలు మరియు డీజిల్ రూ. 76,88 రూపాయలు.గత 18 రోజుల్లో రేట్లు తగ్గింపు పెట్రోలు పై లీటరుకు రూ.4.05 రూపాయలు, డీజిల్ పై రూ.2.33 రూపాయల చొప్పున తగ్గింది. అక్టోబర్ 18 నుంచి రేట్లు తగ్గుముఖం పట్టాయి. పెట్రోలు ధర రికార్డు స్థాయిలో ఢిల్లీలో లీటర్కు రూ.84, రూ. ముంబైలో రూ.91.34 రూపాయలు చొప్పున అక్టోబర్ 4 న నమోదయ్యాయి అదేవిదంగా డీజిల్ రూ. 75.45 రూపాయలు ఢిల్లీలో, ముంబైలో రూ. 80.10 రూపాయలుగా ఉన్నాయి. ఆగస్టు 16 నుంచి ధరలు పెరగడం ప్రారంభమైంది.ఆగస్టు 15 న ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 77.14 మరియు ముంబైలో రూ.84.58 రూపాయలు ఉంది.

అదేరోజు డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ. 68.72 రూపాయలు,ముంబైలో రూ. 72.96 ఉంది. ఆగస్టు 16 మరియు అక్టోబర్ 4 మధ్య,లీటరు పెట్రోల్ పై ధర రూ. 6.86, డీజిల్ రూ. 6.73 రూపాయల చొప్పున పెరిగింది.

గత నెలలో మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.1.50 రూపాయల చొప్పున తగ్గించింది. లీటరుకు రూ. 1 చొప్పున ఇంధన సబ్సిడీపై పిఎస్యు మినహాయింపు చేయాలనీ చమురు సంస్థలను కోరింది. లీటరు పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం యొక్క అభ్యర్థనను అనుసరించి గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలు ఇంధన ధరలను తగ్గించాయి.

పెట్రోలు మరియు డీజిల్ రిటైల్ విక్రయ ధర బెంచ్మార్క్ ఇంధనం అంతర్జాతీయ ధరలపై ఆధారపడి ఉంటుంది మరియు రూపాయి-అమెరికా డాలర్ మారకం రేటు పై ఆధారపడి ఉంటుంది.

Read more about: petrol diesel
English summary

మరింతగా తగ్గిన పెట్రోల్ ధరలు.నేడు ధరలు ఈవిదంగా ఉన్నాయి. | Petrol Prices Cut By Over 4 Rupees Per Litre In Last 18 Days

New Delhi: Petrol price has been cut by over Rs. 4 per litre and diesel by Rs. 2.33 in the last 18 days on softer international rates, a pace faster than the spike in prices witnessed in the two-month period beginning mid-August.
Story first published: Monday, November 5, 2018, 11:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X