పతంజలి జీన్స్ పై హీరో సిద్దార్థ్ కౌంటర్

పతంజలి ఉత్పత్తులతో మార్కెట్‌లోకి వచ్చిన రాందేవ్ బాబా ఫ్యాషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. స్వదేశీ సంప్రదాయంతో 'పతంజలి పరిధాన్'పేరుతో దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. సోమవారం ఢిల్లీలో పతంజలి పరిధాన్ మొదటి స్టోర్‌ను లాంఛ్ చేశారు. దీపావళి, ధనత్రయోదశి సందర్భంగా మార్కెట్‌లోకి.. పతంజలి జీన్స్‌ను విడుదల చేశారు. ఈ పరిధాన్ జీన్స్‌లపై భారీ డిస్కౌంట్లను కూడా ప్రకటించారు రాందేవ్ బాబా. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు 25శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నారు.

రూ.1100కే

రూ.1100కే

పతంజలి పరిధాన్‌ కింద మూడు బ్రాండ్స్‌ను విడుదల చేశారు. ఆస్థా, సంస్కార్‌, లైవ్‌ ఫిట్‌ బ్రాండ్స్‌ కింద దాదాపు 3500 రకాల వస్త్రాలు, షూస్‌, యాక్సెసరీస్‌ను అందుబాటులోకి వచ్చాయి. ఈ స్టోర్‌లో మహిళలు, పురుషులు, చిన్న పిల్లల దుస్తులు దొరకుతాయి. పండుగ సీజన్‌ సందర్భంగా ఒక జీన్స్‌, రెండు టీ షర్టులు (రూ.7000 విలువ చేసేవి) కలిపి కేవలం రూ.1100కే ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.2500 విలువ చేసే రూ.500కే అందిస్తున్నారు

 స్వదేశీ వస్త్రాలను

స్వదేశీ వస్త్రాలను

దేశాన్ని దోచుకుంటున్న మల్టీ నేషనల్‌ కంపెనీలను నియంత్రించేందుకు స్వదేశీ వస్త్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు రాందేవ్ బాబా. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు.

వస్త్ర వ్యాపారంలో

వస్త్ర వ్యాపారంలో

తమ ఉత్పత్తులతో బహుళజాతి కంపెనీలకు ధీటుగా పోటీనిస్తున్న పతంజలి కొత్తగా వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టింది. యువతను ఆకట్టుకొనే జీన్స్, టీషర్ట్స్ ని ప్రవేశపెట్టింది. రూ.7,000 విలువైన 1 జీన్స్, 2 టీ షర్టులను పతంజలి పరిధన్ కేవలం రూ.1,100కే అందిస్తోందని బాబా రాందేవ్ ట్వీట్ చేశారు. బహుళజాతి సంస్థల దోపిడీని అడ్డుకొనేందుకు స్వదేశీ ఉద్యమంలో కలిసి రావాలని ఆయన కోరారు.

నటుడు సిద్ధార్థ్

నటుడు సిద్ధార్థ్

బాబా రాందేవ్ ట్వీట్ కి నటుడు సిద్ధార్థ్ పంచ్ వేశాడు. రూ.7,000 విలువైనవి రూ.1,100కా? అవి రూ.7,000 విలువైనవి ఎందుకు? ఎవరు ఎవరిని దోస్తున్నారు? గందరగోళంగా ఉండే ఆర్థిక శాస్త్రం ఇప్పుడు చాలా సులువైందని రాందేవ్ ట్వీట్ కి రిటార్ట్ ఇచ్చాడు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+