రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 12న ఆమె పెళ్లి అజయ్ పిరమాల్ కుమారుడు ఆనంద్ పిరమాల్‌తో జరగబోతోంది.

పెళ్లి వేడుక
పెళ్లి వేడుక ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై ఊహాగానాలు వస్తున్న సమయంలో, ముంబయిలోని ముకేశ్ అంబానీ స్వగృహంలోనే ఈ వేడుక ఉండబోతోందని ఇరు కుటుంబ వర్గాలు ధ్రువీకరించాయి.

అంబానీ- పిరమాల్
పెళ్లి తంతు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. వివాహ వేడుకకు ముందు వారాంతంలో అంబానీ, పిరమాల్ కుటుంబాలు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఉదయ్‌పుర్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేయబోతున్నారు. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈషా, ఆనంద్‌ల జంటకు ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నారు.

వైరల్
ఈ సందర్భంగా పెళ్లికి సంబంధించిన శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పెళ్లికార్డును
ఇషా వెడ్డింగ్ కార్డు రెండు బాక్సుల్లో అందంగా అమర్చారు. అంబానీ ఫ్యామిలీకి తగ్గట్టు పెళ్లికార్డును డిజైన్ చేశారు. ఒక బాక్సులో వధువు వరుడు పేర్లను ఉంచి పూలతో అందంగా డెకరేట్ చేశారు. మరో బాక్సులో నాలుగు చిన్న బంగారు బాక్సులు ఉన్నాయి. అందులో ఒక చిన్న బాక్సులో సరస్వతి దేవీ విగ్రహాన్ని ఉంచారు . తమ హోదాకు ఏమాత్రం తగ్గకుండా మ్యారెజ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించింది అంబానీ ఫ్యామిలీ అంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

రెండు కుటుంబాలు
వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్‌తో ఇషా అంబాని వివాహం జరగనుంది. ఇషా, ఆనంద్‌లు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇక ఆనంద్ పిరమాల్‌ది కూడా చాలా సంపన్న కుటుంబం. తల్లిదండ్రులు కార్పొరేట్ ప్రపంచంలో సూపర్ స్టార్లు. తాజాగా జరిగిన ఇషా, ఆనంద్‌ల నిశ్చితార్థ వేడుకకు కూడా బాలీవుడ్ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. దీంతో ఈరెండు కుటుంబాలు పెళ్లికి సంబంధించిన రాయల్ డిన్నర్‌ను ఉదేపూర్‌లో ప్లాన్ చేస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications