దీపావళికి మారుతీ కార్ల కంపెనీ సూపర్ ఆఫర్!

దీపావళి పండగను పురస్కరించుకొని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ భారీ ఆఫర్లను ప్రకటించింది. స్విఫ్ట్, డిజైర్, బాలెనో మోడళ్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ భారీ తగ్గింపు ఆఫర్.. ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుతో ఇబ్బందిపడుతున్న వాహనదారులకు చక్కగా కలిసి వస్తుందని మారుతీ పేర్కొంది.

ప్రస్తుతం మారుతీ హ్యుందాయ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఆ పోటీని తట్టుకొని.. ఈ పండగన సీజన్ ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని ఈ ఆఫర్ తీసుకువచ్చింది. పలు మోడళ్లపై 23శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది.

దీపావళికి మారుతీ కార్ల కంపెనీ సూపర్ ఆఫర్!

ఈ డిస్కౌంట్ రూ.7వేల నుంచి రూ.75వేల వరకు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. స్విఫ్ట్, డిజైర్, బాలెనోలపై రూ.18,750 వరకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన డిస్కౌంట్ కన్నా ఇది రూ.3,500 ఎక్కువే.ధంతేరస్‌, దీపావళి సందర్భంగా డిస్కౌంట్‌ ద్వారా మరిన్ని అమ్మకాలను సాధించనున్నామని సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ మరియు అమ్మకాలు) ఆర్‌ ఎస్‌కల్సీ చెప్పారు

పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు ఇన్సూరెన్స్ రేట్లు పెరగడం, వడ్డీ రేట్లు అక్టోబర్‌ నెల రీటైల్‌ విక్రయాలను ప్రభావితం చేశాయి. మరోవైపు అక్టోబర్‌ నెల విక్రయాల్లో మారుతి సుజుకి మెరుగైనప్రదర్శన కనబర్చింది. గత సెప్టెంబరు నెలలో తొలిసారి 1.5శాతం క్షీణతతో 1,38,100 యూనిట్స్ అమ్మితే... అక్టోబర్‌లో 1,46,766 యూనిట్స్‌ను విక్రయించింది. అటు రెండవ అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్‌ కూడా కార్ల ధరలపై డిస్కౌంట్‌ను ప్రకటించనుందని తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+