డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ 40 పైసలు పడిపోయి 74.08 కు చేరుకుంది. దిగుమతిదారుల నుండి అమెరికన్ కరెన్సీలకు డిమాండ్ పెరిగింది.
డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ 40 పైసలు పడిపోయి 74.08 కు చేరుకుంది. దిగుమతిదారుల నుండి అమెరికన్ కరెన్సీలకు డిమాండ్ పెరిగింది. విదేశాల్లో కొన్ని కరెన్సీలపై అమెరికా డాలర్ బలపడటంతో ప్రభుత్వం, ఆర్బిఐల మధ్య వివాదం గురించిన ఆందోళనలు స్థానిక యూనిట్పై కూడా రాభవం చూపింది. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి రూపాయి 45 పైసల మేర క్షీణించి 74.13 వద్దకు పడిపోయింది.

మంగళవారం రూపాయి విలువ 23 పైసలు క్షీణించి 73.68 వద్ద ముగిసింది. అయితే స్థిరమైన ముడి చమురు ధరలు మాత్రం రూపాయి క్షీణత కొంత మేరకు పరిమితం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా బ్రెంట్ క్రూడ్ అంతర్జాతీయ బెంచ్ మార్కు 0.62 శాతం పెరిగి 76.38 డాలర్లకు చేరింది.
మార్కెట్లో లిక్విడిటీని నిర్వహించేందుకు ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు (ఓఎంఓ) ద్వారా ప్రభుత్వం బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా నవంబర్లో 40,000 కోట్ల రూపాయలను వ్యవస్థలోకి తీసుకువచ్చిందని రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు రూ .1,592.02 కోట్లకు చేరుకున్నాయి.
ఇదిలా ఉండగా బిఎస్ఇ సెన్సెక్స్ 158.99 పాయింట్లు పెరగడంతో లాభాల స్వీకరణకు పాల్పడింది.వెంటనే లాభాల బాటలోనే ట్రేడ్ అయింది. గత రాత్రి ఏడు ప్రధాన కరెన్సీలతో కూడిన డాలరు ఇండెక్స్ అరశాతం వరకూ పెరిగి 96.85 పాయింట్ల వద్దకు చేరింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications