కుమారుడి నిశ్చితార్థం జరిపించిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వరుస పెళ్లిళ్ల సందడి జరుగుతున్నాయి ఆయన కుమార్తె ఈషా అంబానీ పిరమల్ గ్రూప్ వారసుడు, అజయ్ పిరమల్, స్వాతి దంపతుల కుమారుడు ఆనంద్ పిరమల్‌ను పెళ్లి చేసుకోబోతోంది. ఈషా సోదరుడు ఆకాశ్ అంబానీ పెళ్లి ఈ ఏడాది డిసెంబరులో జరగనుంది. దాని కన్నా ముందే అదే నెలలో ఈషా పెళ్లి జరగొచ్చని సమాచారం.

ఈషా- ఆనంద్
ఈషా, ఆనంద్ చాలాకాలంగా స్నేహితులు. అంబానీ, పిరమల్ కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా మంచి స్నేహం ఉంది. ఆనంద్ పిరమల్ ఇటీవలే మహాబలేశ్వర్‌లో ఒక గుడి దగ్గర ఈషాకు ప్రపోజ్ చేశారు. ఆమె ఒప్పుకోవడం.. ఇరువైపులా పెద్దలకు తెలియజేయడం వాళ్లూ అంగీకరించడం వేగంగా జరిగిపోయాయి.

పిరమల్ రియల్టీ
పెన్సిల్వేనియా వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, హార్వర్డ్ వర్సిటీలో ఎంబీయే చేసిన ఆనంద్ పిరమల్ ప్రస్తుతం పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘పిరమల్ రియల్టీ' పేరుతో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని స్థాపించారు. ‘పిరమల్ స్వాస్థ్య' పేరుతో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సంస్థను స్థాపించి, రోజుకు 40 వేల మంది రోగులకు చికిత్సనందిస్తున్నారు.

సోషల్ మీడియాలో
ఇక, యేల్ యూనివర్సిటీ నుంచి ‘సైకాలజీ అండ్ సౌత్ ఏషియన్ స్టడీస్'లో పట్టభద్రురాలైన ఈషా.. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ బోర్డుల్లో సభ్యురాలిగా ఉంది. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే చేస్తోంది. జూన్ నాటికి ఆమె చదువు పూర్తవుతుంది. కాగా.. ఆనంద్ ఈషాకు ప్రపోజ్ చేస్తున్న దృశ్యాలు అప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక తాజాగా
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 12న ఆమె పెళ్లి అజయ్ పిరమాల్ కుమారుడు ఆనంద్ పిరమాల్‌తో జరగబోతోంది. పెళ్లి వేడుక ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై ఊహాగానాలు వస్తున్న సమయంలో, ముంబయిలోని ముకేశ్ అంబానీ స్వగృహంలోనే ఈ వేడుక ఉండబోతోందని ఇరు కుటుంబ వర్గాలు ధ్రువీకరించాయి.

అంబానీ
పెళ్లి తంతు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. వివాహ వేడుకకు ముందు వారాంతంలో అంబానీ, పిరమాల్ కుటుంబాలు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఉదయ్‌పుర్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేయబోతున్నారు. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈషా, ఆనంద్‌ల జంటకు ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications