మన దేశంలో రోజుకో ధర పలుకుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్యుడికి నడ్డి విరుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుండి ప్రజలకి కొంత ఉపశమనం కలిగింది ఎందుకంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. కానీ ఇంగ్లాండ్ దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

సామాన్యుణ్ని
సామాన్యుణ్ని కన్విన్స్ చేసేలా ఇంగ్లాండ్ బడ్జెట్ రూపొందించారు. చాన్సలర్ హేమండ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముఖ్యంగా వరుసగా 9వ సంవత్సరం కూడా చమురు ధరలు పెంచకపోవడంతో సామాన్యుడు రిలీఫ్ ఫీలవుతున్నాడు. హేమండ్ బడ్జెట్ పాఠం చదువుతున్నకొద్దీ సభికుల నుంచి ఆనందం వ్యక్తం కావడం విశేషం.

బ్రిటిష్ ప్రజల
బ్రిటిష్ ప్రజల కష్టంతోనే దేశం నడుస్తోందని, ఆర్థిక సంస్కరణలు, కష్టాలు ఇక ముగిసినట్లేనని భరోసా ఇచ్చారు. ఏప్రిల్ నుంచి కనీస వేతనంలో 4.9 శాతం పెరుగుదలతో 7.83 పౌండ్ల నుంచి 8.21 పౌండ్లకు పెంచుతామన్నారు. దీంతో సగటు పౌరుడి వార్షికాదాయం 690 పౌండ్లకు పెరుగుతుంది.
వ్యాపారస్తులకు
దేశంలోని 32 మిలియన్ ప్రజలకు ట్యాక్స్ తగ్గిస్తున్నామని, దీంతో 130 పౌండ్లు సగటు పౌరుడి పాకెట్లో సురక్షితంగా ఉంటాయన్నారు. వరుసగా 9వ సంవత్సరం కూడా చమురు ధరలు పెంచండం లేదంటూ మరో సంతోషకరమైన వార్త చెప్పారు. ఇంగ్లాండ్ లోని అన్ని చిల్లర కొట్లకు మరింత వెసులుబాటు కల్పిస్తూ.. 51 వేల పౌండ్ల వరకు విలువైన వ్యాపారస్తులకు పన్ను రేట్లను వన్ థర్డ్ తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.

మన దేశంలో ఈరోజు పెట్రోల్ ధరలు:
వరుసగా 13వ రోజులపాటు తగ్గుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు బుధవారం (అక్టోబరు 31) స్థిరంగా ఉన్నాయి. ధరల్లో ఎలాంటి తగ్గుదల లేదు. దేశవ్యాప్తంగా మంగళవారం నాటి ధరలే అమలుకానున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.79.55 ఉండగా డీజిల్ ధర రూ.73.78 గా ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ పెట్రోలు ధర రూ.85.04 ఉండగా డీజిల్ ధర రూ.77.32 గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.84.33 గా ఉండగా డీజిల్ ధర రూ.80.25 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.83.48 ఉండగా డీజిల్ ధర రూ.78.97 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరింత తగ్గి 76.38 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ నెలలో బ్యారెల్ ధర 86 డాలర్లకు ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే.
అక్టోబరు 31న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ ₹ 79.55 ₹ 73.78
ముంబయి ₹ 85.04 ₹ 77.32
కోల్‌కతా ₹ 81.43 ₹ 75.63
చెన్నై ₹ 82.65 ₹ 78.00
బెంగళూరు ₹ 80.17 ₹ 74.16
హైదరాబాద్ ₹ 84.33 ₹ 80.25
విజయవాడ ₹ 83.48 ₹ 78.97
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications