భారతీయులకి మరో షాక్ ఇవ్వబోతున్న డోనాల్డ్ ట్రంప్

వలసదారులకు వ్యతిరేకిగా ముద్రపడ్డ అయెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తన పంథాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాయేతరులకు షాక్ ఇచ్చే మరో నిర్ణయం తీసుకోనున్నారు. అమెరికాయేతరులకు జన్మించే శిశువులకు జన్మతః వచ్చే పౌరసత్వ హక్కు రద్దుకు ఆదేశాలు ఇవ్వాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఇది న్యాయ నిపుణులు సమీక్ష కోసం పంపినట్లు అధికారిక వర్గాల సమచారం. న్యాయ నిపుణుల అభిప్రాయం తర్వాత దీన్ని చట్టం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదే జరిగితే భారత్ తో పాటు ప్రపంచ నలుమూల నుంచి అమెరికాకు వలస వెళ్లిన వారికి ఇబ్బందులు తప్పవునే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వలసదారుల వ్యతిరేక నిర్ణయం వెలవడితే అమెరికాలో నివసిస్తున్న అమెరికాయేతరులు ఉద్యమ బాట పట్టే అవకాశముందే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 రాజకీయ లబ్ది కోసమే

రాజకీయ లబ్ది కోసమే

ఇప్పటికే ఆయన హెచ్-1బి, గ్రీన్‌ కార్డు, ఇతర వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వలసదారుల పిల్లలకు జన్మతః లభించే హక్కు రద్దు చేస్తే మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చనేది ట్రంప్ ఎత్తుగడ. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నోఏళ్లగా అమెరికాలో స్థిరపడ్డ తమ పట్ల ఉక్కుపాదం మోపడం సరికాదంటూ పలువురు ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయనిపుణులు

న్యాయనిపుణులు

ఒక వేళ ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకంటే న్యాయపోరాటనికి సిద్ధమని పలువురు ఎన్నారైలు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణ ఆ దేశంలో జన్మించే చిన్నారులకు పౌరసత్వ హక్కును లభిస్తుంది. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసే నిర్ణయం తీసుకుంటే ట్రంప్.. న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అమెరికా చట్టాలు తెలిసిన పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హెచ్1 బీ

హెచ్1 బీ

ట్రంప్ భారతీయులను కలవరపాటుకు గురిచేస్తున్నారు. తన సంచలన - వివాదస్పద నిర్ణయాలతో ట్రంప్ ముందుకు సాగుతున్న తీరుతో విపరిణామాలు తప్పవని భారతీయ టెకీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదేవిషయం తాజాగా చేపట్టిన అధ్యయనంలో స్పష్టమైంది. అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో లక్షమంది ప్రవాస భారతీయులు కొలువులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అధ్యయనంలో పాల్గొన్న భారతీయ మూలాలున్న ఉద్యోగులు వెల్లడించారు.

అమెరికాలో హెచ్1 బీ వీసా కలిగిన వృత్తినిపుణుల జీవిత భాగస్వామ్యులకు వర్క్ పర్మిట్ ను రద్దుచేయాలనే ఆలోచనతో ట్రంప్ సర్కార్ ఉందని వారు వాపోయారు.

ఒబామా సర్కార్

ఒబామా సర్కార్

హెచ్1 బీ వీసా కలిగిన వృత్తినిపుణుల జీవిత భాగస్వామ్యులకు వర్క్ పర్మిట్ అవకాశాన్ని తాజా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కల్పించారు. అత్యంత నిపుణులైన వారి భాగస్వామ్యులకూ పని చేసే సౌకర్యం ఉంటే వారు అమెరికా వీడి వెళ్లకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఒబామా సర్కార్ దీనిని అమల్లోకి తెచ్చింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని అందిపుచ్చుకొని అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులు కొల్లగొట్టేస్తున్నారని ఆరోపిస్తూ వీసా నిబంధనలు కఠినతరం చేశారు.

అమెజాన్

అమెజాన్

అందులో భాగంగా హెచ్4 వీసాను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. వీసా నిబంధనలు కఠినతరం చేయాలన్న ట్రంప్ సర్కార్ ప్రణాళికలను గూగుల్ - అమెజాన్ - మైక్రోసాఫ్ట్ - ఫేస్ బుక్ వంటి సంస్థలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయిఅమెరికా ప్రభుత్వం తాజా ప్రణాళికలతో వేలాది ప్రవాస భారతీయుల కుటుంబాలపైనా - వారు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యాలపైన ప్రతికూల ప్రభావం పడుతుందని వాపోతున్నాయి.

ట్రంప్ సర్కార్

ట్రంప్ సర్కార్

ఈనేపథ్యంలో ట్రంప్ సర్కార్ వీసా విధానాన్ని కఠినతరం చేస్తే కలిగే నష్టం గురించి టెన్యూనివర్సిటీకి చెందిన క్రిస్టోఫర్ జే.ఎల్. కన్నింగమ్ - యూనివర్సిటీ ఆఫ్ లైమ్రిక్లో కెమ్మి బిజినెస్ స్కూలుకి చెందిన పూజ బి విజయ్ కుమార్ లు 1800 మంది ప్రవాస భారతీయ కుటుంబాలతో మాట్లాడి ఓ అధ్యయన నివేదికను రూపొందించారు. అధ్యయన నివేదిక ప్రకారం లక్ష మంది వరకు ఉద్యోగాలు కోల్పోతుండగా.ఎక్కువ మంది మహిళలే ఉద్యోగాలు కోల్పోతారు. వర్క్ పర్మిట్ పొందినవారిలో 93 శాతం మంది మహిళలైతే ఏడు శాతం పురుషులు ఉన్నారు.

తాజా నిర్ణయంతో తట్టా బుట్టా సర్దుకునేందుకు భారతీయ ఉద్యోగుల భాగస్వామ్యులు రెడీ అవుతున్నారని సమాచారం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+