మరో బంపర్ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్

వాల్ మార్ట్ అనుబంధ సంస్థ ఫ్లిప్ కార్ట్ తరహాలోనే మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోమారు వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. నవంబర్ రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు నాలుగు రోజులు 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' నిర్వహిస్తామని ప్రకటించింది.

ఇందులో భాగంగా పలు ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న అమెజాన్ ఆ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై పదిశాతం రాయితీ ఇవ్వనుంది.

మరో బంపర్ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్

డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఆకర్షణీయమైన ఈఎంఐ ఆప్షన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంకా రూ.2000 నుంచి రూ.4,999 మధ్య జరిపే కొనుగోళ్లపై అదనంగా ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది.

రూ.5వేలు ఆపైన జరిపే కొనుగోళ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో క్యాష్ బ్యాక్ లభించనుంది. వన్‌ప్లస్ 6టీ మొబైల్ కూడా అందుబాటులోకి రానుంది. గురువారం నుంచి వన్ ప్లస్ 6టీ మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.

దీంతోపాటు కొత్త కస్టమర్‌కు ఉచిత డెలివరీ, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, బుక్‌మైషో, స్విగ్గీ వోచర్లు, అమెజాన్ పే బ్యాలెన్స్ ఇవ్వనుంది. రూ.500 అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసే వారికి ఈ ప్రయోజనాలు లభిస్తాయి. రెడ్‌మీ 6 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎ8ప్లస్, రియల్ మీ 1 వంటి వాటిపై భారీ ఆఫర్లు లభించనున్నాయి. వీటితోపాటు మరెన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకురానుంది.

ల్యాప్ టాప్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో రూ.25 వేల వరకు కొనుగోలు చేస్తే రాయితీ ఇస్తుంది. రూ.249 ధర పలికే కెమెరా, ఆడియో, హెడ్ ఫోన్లు, రూ. 3,299 ధర గల 1టీబీ హార్డ్ డ్రైవ్ తదితరాలపై 70 శాతం ఆఫర్ అందుబాటులో ఉంది.

ఎంఐ టీవీ 49 అంగుళాల టీవీలను ప్రతి రోజు ఉదయం 11 గంటలకు ఫ్లాష్ సేల్ కింద విక్రయిస్తారు. అతిపెద్ద వస్తువులపై రూ.22 వేల వరకు అదనపు రాయితీలు కల్పిస్తోంది అమెజాన్. ఈఎంఐలు అతి తక్కువగా రూ.290 నుంచే ప్రారంభిస్తోంది.

ఫ్యాషన్, హోం, కిచెన్ వస్తువులపై 80 శాతం రాయితీ కల్పిస్తోంది. అమెజాన్ వస్తువులు ఎకో రేంజ్, ఫైర్ టీవీ స్టిక్, కైండ్ లే ఈ - రీడర్లపై రూ.3,500 వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ల సేల్స్ లో వన్ ప్లస్, హానర్, షియామీ, శామ్ సంగ్, రియల్ మీ, హువాయి, వివో, మొటరోలా, తదితర బ్రాండ్లలో ఎంపిక చేసుకున్న మోడల్ ఫోన్లపై రాయితీలు లభిస్తాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+