పెట్రోల్ ధరలు మరింతగా తగ్గుముఖం పట్టాయి.నేడు ధరలు ఈ విదంగా ఉన్నాయి.
ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్,డీజిల్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. పెట్రోలు ధరలు మెట్రో నగరాల్లో 20-21 పైసల చొప్పున తగ్గాయి.
ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్,డీజిల్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. పెట్రోలు ధరలు మెట్రో నగరాల్లో 20-21 పైసల చొప్పున తగ్గాయి. డీజిల్ ధర లీటరుకు 7-8 పైసలు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 20 పైసలు తగ్గి రూ.79.55 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా ఢిల్లీలో డీజిల్ ధర రూ.73.78 రూపాయలుగా ఉంది. సోమవారం ధర 73.85 రూపాయలుగా ఉంది.

గత రెండు వారాలుగా
గత రెండు వారాలుగా తగ్గుతూ వస్తున్న ఇంధన ధరలు వినియోగదారులకు కాస్త ఉపశమనం లభిస్తోంది. గత రెండు వారాల్లో పెట్రోలు ఢిల్లీలో లీటరుకు 2 రూపాయల చొప్పున తగ్గింది. డీజిల్ పై ధర రూ .1.50 రూపాయలు చొప్పున తగ్గింది.
దేశం లో వ్యాపార రాజధాని ఐన ముంబైలో పెట్రోలు ధర రూ.85.04 రూపాయలు, డీజెల్ రూ.77.32 రూపాయల వద్ద వీకైఎంచబడుతోంది.

మోడీ ప్రభుత్వం
చెన్నై, కోలకతాలలో పెట్రోలు ధర రూ.82.65 మరియు రూ.81.43 రూపాయల చొప్పున లభించగా అలాగే డీజిల్ ధర రూ .78, రూ .75.63 రూపాయలుగా నిర్ణయించింది.
ఈ నెల ఆరంభంలో మోడీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని 1.50 రూపాయల మేర తగ్గించింది. లీటరుకు రూ. 1 చొప్పున ఇంధన సబ్సిడీపై పిఎస్యు చమురు సంస్థలను తగ్గించాలని కోరింది. లీటరు పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.

కేంద్రం అభ్యర్థనను
కేంద్రం యొక్క అభ్యర్థనను అనుసరించి, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి అనేక రాష్ట్రాలు ఇంధన ధరలను తగ్గించాయి కాని ఢిల్లీ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించలేదు.దీని కారణంగా పెట్రోల్ మరియు డీజిల్ నోయిడాలో ఇప్పుడు తక్కువ ధర వుంది. పెట్రోలు నోయిడాలో లీటరుకు రూ. 77.40 వద్ద విక్రయించగా, డీజిల్ ధర రూ. 71.91 రూపాయలు గా ఉంది.


Click it and Unblock the Notifications