టెలికామ్ రంగంలోకి అడుగు పెడుతూనే పెను సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జియో సెలబ్రేషన్ ఆఫర్లు అందజేస్తోంది. జియో తన యూజర్లకు భారీ బహుమానాలు, బంపర్ ఆఫర్లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు.

ఈ సారి
ఈ సారి జియో తన యూజర్లకు వారానికి 2జీబీ డేటా బహుమతిగా అందజేస్తోంది. మీ రెగ్యులర్ ప్లాన్ లోని డేటా అయిపోగానే ఈ డేటా కలుస్తుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని మై జియో యాప్ లో పేర్కొన్నారు.

ఈ ఆఫర్
అయితే ఈ బహుమతి జియోకి ఉన్న 258 మిలియన్ యూజర్లకు ఇస్తున్నట్టు కంపెనీ చెప్పలేదు. కేవలం కొందరు ఎంపిక చేసిన వినియోగదారుల ఖాతాలకు మాత్రమే ఈ అదనపు డేటా కలుస్తుందని తెలిసింది. అయితే ఈ ఎంపిక చేసిన వినియోగదారులు ఎవరో, ఎలా ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ట్రయల్ పీరియడ్ సమయంలో జియో కనెక్షన్ తీసుకున్న మొట్టమొదటి విడత వారికే ఈ ఆఫర్ ప్రయోజనాలు అందజేయనున్నట్టు భావిస్తున్నారు.

2జీబీ ఫ్రీ డేటా ఎలా పొందాలి?
- మై జియో యాప్ ఓపెన్ చేయాలి
- జియో మొబైల్ నెంబర్ తో లాగిన్ కావాలి
- మై ప్లాన్ కి వెళ్లి వివరాలు చూసుకోండి
- జియో సెలబ్రేషన్ ఆఫర్ ట్యాబ్ లో వివరాలు ఉంటాయి.

దీపావళి బంపర్ ఆఫర్లు:
ప్రముఖ టెలికాం సంస్థ జియో దీపావళి మరో బంపర్ తీసుకువచ్చింది. గత ఏడాది దీపావళి సందర్భంగా లాంచ్ చేసిన ధనాధన్ ఆఫర్‌లాంటి ఆఫర్‌ను ఈ ఏడాది కూడా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో దివాలీ ఆఫర్ 100 శాతం క్యాష్‌బ్యాక్ పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీని ప్రకారం రూ .149 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై వంద శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.

నవంబర్
నవంబర్ 30వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జియో ప్రైమ్ సభ్యులతో పాటు కొత్త, పాత జియో సభ్యులందరూ ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హులు. దీపావళి ఆఫర్‌గా ప్రీపెయిడ్ రీచార్జ్‌లపై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్. రూ .149, రూ. 198, రూ 299, రూ .349, రూ. 398, రూ 399, రూ .448, రూ 449, 498, రూ .509, రూ. 799, రూ. 999, రూ. 1699, రూ. 1999, రూ. 4999 రూ. 9999. ప్లాన్లపై ఈ క్యాష్ బ్యాక్ అందిస్తోంది.

క్యాష్‌బ్యాక్
అయితే ఈ క్యాష్‌బ్యాక్ రిలయన్స్ డిజిటల్ కూపన్లు రూపంలో ఉంటుంది. రూ.509 వరకు రీచార్జ్‌లపై ఒక కూపన్‌ను అందిస్తోంది. ఆపైన రీచార్జ్‌లపై అందించే కూపన్లు ఒకటి కంటే ఎక్కువ కూపన్లలో ఆఫర్ చేయనుంది. డిసెంబరు 31, 2018 వరకు క్యాష్ బ్యాక్ కూపన్లు చెల్లుతాయి. రిలయెన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో రూ.5 వేలు, అంతకన్నా ఎక్కువ విలువైన వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో మాత్రమే ఈ కూపన్లను వాడుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications