బ్రేకింగ్ న్యూస్ LIC పాలసీలో భారీ మార్పులు ఏంటో మీరే చూడండి.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ. భారతదేశంలో కోట్లాదిమంది పాలసీదారులున్న అతిపెద్ద సంస్థ. ఇటీవల మోసాలు పెరిగిపోతుండటంతో ఎల్ఐసీ యాజమాన్యం ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తోంది. పాలసీదారుల్ని అప్రమత్తం చేస్తోంది. మరి మీరు కూడా ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. పాలసీ ప్రీమియం డిపాజిట్ చేసే నిబంధన మారింది.

 ప్రీమియం

ప్రీమియం

మీరు ఎల్ఐసీ ప్రీమియం చెల్లించేందుకు ఇచ్చే చెక్కుపై ఎల్ఐసీ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనా వేరే పేరు మీద చెక్కు ఇవ్వాలని అడిగితే నిరాకరించండి. ఆ విషయాన్ని ఎల్ఐసీకి తెలపండి.

ఎల్ఐసీ

చెక్కు లేదా డీడీ తప్పనిసరిగా ఎల్ఐసీ ఆఫ్ ఇండియా పేరు మీదే ఉండాలి. దానిపైన పాలసీ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఎక్కువ పాలసీలకు ఒకే చెక్కు ఇవ్వాలనుకుంటే. చెక్కు ముందు వైపు ఓ పాలసీ నెంబర్, చెక్కు వెనుకవైపు మిగతా పాలసీ నెంబర్లు రాయాలి.

ఎల్ఐసీ పాలసీ హామీగా రుణాన్ని ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

ఎల్ఐసీ పాలసీ హామీగా రుణాన్ని ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

ఎల్ఐసీ నుంచి ఎక్కువ మంది కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపేది ఎండోమెంట్ పాల‌సీల‌నే. అత్య‌వ‌సరాల్లో ఈ త‌ర‌హా పాల‌సీలు హామీగా రుణం సైతం పొంద‌వ‌చ్చు. ఇప్పటి వరకు ఎల్‌ఐసీ పాలసీపై రుణం తీసుకోవాలంటే కార్యాలయం వరకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఇదంతా కాస్త స‌మ‌యం ప‌ట్టే వ్య‌వ‌హార‌మే. ఈ ఇబ్బందికి విముక్తి కల్పిస్తూ ఆన్‌లైన్‌లోనే పాలసీపై రుణం పొందే వెసులుబాటును ఎల్‌ఐసీ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ముఖ్య విష‌యాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

పాలసీ బాండ్‌

పాలసీ బాండ్‌

పాలసీని స్వాధీన‌ప‌రిస్తే ఎంత అయితే వస్తుందో ఆ విలువలో 90 శాతాన్ని ఎల్‌ఐసీ రుణంగా ఇస్తుంది. పెయిడప్‌ పాలసీలు అయితే ఇది 85 శాతం. సంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీలపైనే గానీ, టర్మ్‌ ప్లాన్లపై రుణం రాదు. ఆరు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తూ పాలసీ గడువు ముగిసే వరకూ అసలు చెల్లించకుండా రుణాన్ని కొనసాగించుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం నుంచి ఎల్‌ఐసీ అసలును మినహాయించుకుంటుంది. లేదా పాలసీదారుడు మరణిస్తే పరిహారం నుంచి ఆ మేరకు తగ్గించుకుంటుంది. ఒకవేళ వడ్డీ కూడా చెల్లించకుంటే మాత్రం పాలసీని ముందే ట‌ర్మినేట్‌ చేసే హక్కు ఎల్‌ఐసీకి ఉంది. రుణ కనీస కాల వ్యవధి ఆరు నెలలు. ఆ లోపు రుణం తీర్చేయాలనుకుంటే ఆరు నెలల వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. రుణం తీసకున్న తర్వాత ఆరు నెలల్లోపే పాలసీదారుడు మరణిస్తే లేదా కాల వ్యవధి తీరితే అప్పటి వరకే వడ్డీని ఎల్‌ఐసీ లెక్కకడుతుంది. రుణం తీసుకోవాలంటే పాలసీ తీసుకుని కనీసం మూడేళ్లు పూర్తయి సరెండర్‌ వ్యాల్యూ కలిగి ఉండాలి. పాలసీ బాండ్‌ను ఎల్‌ఐసీకి ఇవ్వాలి. ఇంకా అర్హత ఉంటే అదే పాలసీపై రెండో రుణం కూడా తీసుకునేందుకు వీలుంది. ఎల్‌ఐసీ కాకుండా ఇతర ఆర్థిక సంస్థల నుంచి సైతం బీమా పాలసీపై రుణం తీసుకోవచ్చు. కాకపోతే ఎల్‌ఐసీ సరెండర్‌ విలువలో 90 శాతం రుణంగా ఇస్తే, ఇతర సంస్థలు ఇంతకంటే తక్కువ మేరే రుణమిస్తాయి.

వెబ్‌సైట్‌లో

వెబ్‌సైట్‌లో

ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ కాలమ్‌లో ‘ఆన్‌లైన్‌ లోన్‌' ఆప్షన్‌ ఎంచుకోవాలి. మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడే రిక్వెస్ట్‌ ఫర్‌ ద లోన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. కొత్తగా రుణం తీసుకోవాలనుకుంటే దీన్ని ఎంపిక చేసుకోవాలి. ఇప్పటికే రుణం తీసుకుని వడ్డీ, అసలు చెల్లించాలనుకునే వారి కోసం మరో ఆప్షన్‌ కూడా ఈ పేజీలోనే కనిపిస్తుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఎల్‌ఐసీ పాలసీదారుడి బ్యాంకు ఖాతాలో రుణం మొత్తం జమ చేస్తుంది. అందుకే దీనికంటే ముందు ఎల్‌ఐసీకి ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాలు సరిగా ఉన్నదీ, లేనిదీ పరిశీలించాలి.

 పాలసీదారుడు

పాలసీదారుడు

అత్యవసరాల్లో వేగంగా రుణం పొందొచ్చు. పర్సనల్‌ లోన్‌ కంటే వడ్డీ రేటు చాలా తక్కువ. ఆన్‌లైన్‌లోనే చెల్లించే వెసులుబాటు. క్రెడిట్‌ స్కోరుతో అవసరం లేదు. ఏ ఇతర అర్హత పత్రాలను ఇవ్వాల్సిన పని లేదు. అలాగే, పాలసీదారుడు అకాల మరణం చెందితే ఆధారపడిన వారికి పరిహారం తక్కువగా వస్తుంది. ఎందుకంటే అందులో నుంచి రుణాన్ని ఎల్‌ఐసీ మినహాయించుకుంటుంది.

రుణం

రుణం

అత్య‌వ‌స‌రాల్లో పాల‌సీ ఆధారిత రుణం ఉప‌యోగ‌ప‌డినప్ప‌టికీ, రుణం చాలా తక్కువగా లభించడం, పన్ను ప్రయోజనాలు లేకపోవడం గమనించాల్సిన అంశాలు. స్వాధీన‌త విలువ ఆధారంగా రుణం మొత్తాన్ని నిర్ణ‌యిస్తున్నందున పాల‌సీ కొనుగోలు చేసిన మొద‌టి కొన్ని సంవ‌త్స‌రాలు ఎక్కువ మొత్తం డ‌బ్బు అవ‌స‌రం ఉంటే కేవ‌లం ఈ త‌ర‌హా రుణంపై ఆధార‌ప‌డి మ‌న‌లేం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+