ఫ్లిప్కార్ట్ యొక్క దీపావళి సేల్ ప్రకటన తరహాలోనే, అమెజాన్ కూడా నవంబర్ 2 నుండి నవంబరు 5 వరకు తన స్వంత గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది.
ఫ్లిప్కార్ట్ యొక్క దీపావళి సేల్ ప్రకటన తరహాలోనే, అమెజాన్ కూడా నవంబర్ 2 నుండి నవంబరు 5 వరకు తన స్వంత గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రకటించింది. ఈ సమయంలో అమెజాన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో భాగస్వామి గ ఉంటూ,డెబిట్ మరియు క్రెడిట్ కార్డు హోల్డర్లకు 10 శాతం డిస్కౌంట్ను అందించడానికి అలాగే లాభదాయకమైన EMI ఎంపికలతో కూడిన సదుపాయం అందించనుంది.

క్యాష్ బ్యాక్ ఆఫర్
మొత్తం ఆర్డర్ విలువ రూ. 2,000 నుండి రూ. 4,999 కొనుగోలు చేసిన వారికి 5 శతం క్యాష్ బ్యాక్ ఆఫర్ మరియు 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ మొత్తం ఆర్డర్ విలువ రూ.5,000 మరియు అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి లభించనుంది. ఈ క్యాష్బ్యాక్ అమెజాన్ పే బ్యాలన్స్ గా చెల్లిస్తారు. బహుశా విక్రయ సమయంలో అతిపెద్ద ఆఫర్ అయిన OnePlus 6T, దీని అమ్మకం నవంబరు 1 న మొదలవుతుంది మరియు అనేక ఇతర ఆఫర్లతో జాబితా చేయబడనుంది.

పూర్తి EMI
అమెజాన్ ఎటువంటి ధర చెల్లించని పూర్తి EMI ఎంపికలను అందిస్తోంది, మరియు కొత్త కస్టమర్ యొక్క మొదటి విక్రయం లో భాగంగా ఉచిత డెలివరీ సదుపాయం. E- కామర్స్ దిగ్గజం బుక్ మై షో మరియు స్విగ్గి వోచర్లు వినియోగదారులు రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి లభించనున్నాయి. Redmi 6 ప్రో, శామ్సంగ్ గెలాక్సీ A8 +, మరియు రియల్ మీ 1 వంటి స్మార్ట్ ఫోన్లు లాభదాయకమైన డిస్కౌంట్లతో అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, EMI ఎంపికలు కూడా అందించనుంది. ల్యాప్ టాప్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల పై రూ. 25,000 ఆఫర్, కెమెరా మరియు ఆడియోలో 70 శాతం వరకు ఆఫర్, హెడ్ ఫోన్లు ధర రూ. 249, మరియు 1TB హార్డు డ్రైవులు రూ. 3,299 రూపాయల ధరలకు లభించనున్నాయి.

అమెజాన్ ఫ్లాష్ సేల్ ఆఫర్స్
MI TV 49-అంగుళాల అమ్మకం సమయంలో ప్రతి రోజు 11 ఉదయం ఫ్లాష్ విక్రయాలను అందిస్తోంది.అమెజాన్ అదనపు రూ. 22,000 పెద్ద ఉపకరణాల మార్పిడికి, EMI లతో పాటుగా రూ. 290 నెలకు చెల్లించే సదుపాయం. ఫ్యాషన్, హోమ్ మరియు వంటగది సామాను వంటిపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది, మరియు ఎకో రేంజ్, ఫైర్ టీ స్టిక్, మరియు ఇ-రీడర్లు వంటి అమెజాన్ పరికరాలకు రూ. 3,500 రూపాయల వరకు ఆఫర్ లభించనుంది.

స్మార్ట్ ఫోన్ సేల్:
అమ్మకాల్లో పాల్గొనే స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు OnePlus, హానర్, Xiaomi, శామ్సంగ్, రియల్ మీ, హువాయ్, వివో, మోటరోలా మరియు మరికొన్ని ఉన్నాయి. అమెజాన్ బేసిక్స్ వస్తువులపై 65 శాతం వరకు ఆఫర్ ఉంది, మరియు ఎంచుకున్న మొబైలేళ్ల పై ఉచిత నష్టం రక్షణ, ఒక సారి స్క్రీన్ రీప్లేస్మెంట్ మరియు మరిన్ని ఒప్పందాలు పొందుతారు.


Click it and Unblock the Notifications